కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ డిస్టెన్సింగ్ పై పెద్ద ఎత్తున అవగాహన పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఇలాంటి ప్రయత్నాలను అటు సినిమా పెద్దలు కూడా తమ భుజాన వేసుకున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ మొదలు అందరు హీరోలు సోషల్ డిస్టెన్స్ పై అవగాహన పెంచేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే ప్రజల్లో అవగాహన పెంచేలా పాటలు కూడా సిద్ధం చేశారు. కాగా జబర్దస్త్ నటులు మాత్రం ఇలాంటి ప్రయత్నాల్లో చేతులు కలపకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ , యాంకర్ విష్ణుప్రియ ఇద్దరూ జంటగా విడుదల చేసిన పోవే పోరా ప్రోమో విడుదలైంది. ఇందులో ఎప్పటి లాగే ఇద్దరూ కలిసి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా పాటకు ఇద్దరూ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చారు. అంతే కాదు ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. అయితే మామూలు పరిస్థితులు ఉన్నప్పుడు ఇలా చేసి ఉంటే ఫ్యాన్స్ ఎంజాయ్ చేసి ఉండేవారు. కానీ కరోనా నేపథ్యంలో ఇలా చేయడం ఎంత వరకూ సబబు అని నెటిజన్లు మండి పడుతున్నారు.
ఓ వైపు ప్రపంచం అంతా సోషల్ డిస్టన్స్ వైపు అడుగులు వేస్తుంటే..సుడిగాలి సుధీర్ మాత్రం బాధ్యత మరిచి ఇలా చేయడం ఎంత వరకూ సబబు అని అంటున్నారు. అంతేకాదు సుడిగాలి సుధీర్ లాంటి వారు ముందుకు వచ్చి సోషల్ డిస్టన్స్ గురించి ఏదైనా చెబితే మంచిదని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sudigali sudheer