Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం నుండి పరిచయమైన సుధీర్ అందులో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
Sudigali Sudheer: బుల్లితెర స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి, తన కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ ప్రోగ్రాం నుండి పరిచయమైన సుధీర్ అందులో తన కామెడీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్టార్ కమెడియన్ గా నిలిచాడు. అంతేకాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో కీలక పాత్రలో మెప్పించాడు. ప్రస్తుతం బుల్లితెర లో వరుస షోలలో బాగా బిజీగా ఉన్నాడు.
ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షోలో యాంకర్ గా చేసి మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. అంతేకాకుండా డీ డాన్స్ షోలో కూడా రష్మీ తో కలిసి టీమ్ లీడర్ గా చేస్తున్నాడు. నిజానికి ఏ షోలో నైనా సుధీర్ ఉంటే ఆ సందడే వేరు. ఇక సుధీర్ కి ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. పైగా యాంకర్ రష్మీ తో ఎంత రచ్చ చేస్తుంటాడో చూస్తూనే ఉంటాం. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వినిపించగా.. అవన్నీ పుకార్లే అని పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నప్పుడు తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా సుధీర్ పెళ్లి పై తన తండ్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రస్తుతం సుధీర్ మరో షో శ్రీదేవి డ్రామా కంపెనీ లో యాంకరింగ్ చేస్తున్నాడు. ఇందులో ఎంతో మంది సెలబ్రెటీలను ఆహ్వానించి తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేస్తుంటారు. అంతేకాకుండా అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ లను అందిస్తుంటారు. ఇక తాజాగా వచ్చేవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో ఫాదర్స్ డే సందర్భంగా కమెడియన్స్ తండ్రులను ఆహ్వానించారు.
ఇందులో సుడిగాలి సుధీర్ తన తండ్రితో వీడియో కాల్ మాట్లాడగా.. హైపర్ ఆది వచ్చి మీ అబ్బాయికి పెళ్లి ఎప్పుడు చేస్తారు.. మనోడి తర్వాత నేను రెడీగా ఉన్నాను అని అనడంతో సుధీర్ తండ్రి షాక్ అయ్యాడు. ఇక వెంటనే స్పందించిన సుధీర్ తండ్రి.. 'ముందు నువ్వు చేసుకో.. నువ్వు చేసుకుంటేనే చేసుకుంటా అంటున్నాడు' అని అనగా వెంటనే హైపర్ ఆది నేను చేసుకుందామని ఒక అమ్మాయిని చూసుకున్నాను.. కానీ ఆ అమ్మాయిని మనోడు చూసేసుకున్నాడు అని షాకింగ్ కామెంట్ చేశాడు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.