సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాదు. అటు సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా సైతం వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక మెజీషియన్ స్థాయి నుంచి పెద్ద సెలబ్రిటీ స్థాయికి ఎదిగిని సుడిగాలి సుధీర్‌కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ తో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఉన్నారు. ఇదిలా ఉంటే సుధీర్ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అయితే ఈ సినిమా కోసం హీరోయిన్ ధన్య బాలక్రిష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టింది. షూటింగ్ సమయంలో సుడిగాలి సుధీర్ చాలా సీరియస్ గా ఉండేవారని, ముఖ్యంగా సుధీర్ ఒక రోజు తాను కాస్త లేట్ అయినందుకు చాలా గందరగోళం సృష్టించాడని ఆమె చెప్పుకొచ్చింది. డైరక్టర్ మీద సైతం ఆయన చిందులు వేశాడని, హీరోయిన్ చెప్పినట్లు వినండని మధ్యలోనుంచి లేచి వెళ్లిపోయాడని ధన్య బాలక్రిష్ణ తన ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే ఇదంతా నిజం కాదని పక్కనే ఉన్న సుధీర్ కొట్టి పారేసినప్పటికీ, ఈ కామెంట్స్ ను ధన్య మాత్రం ఖండించకపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir