Dhee రాజు విషయంలో సుడిగాలి సుధీర్ సీరియస్....శేఖర్ మాస్టర్‌తో బిగ్ ఫైట్... రష్మీ చెప్పినా వినకుండా...

రాజు సెమీ ఫైనల్ కు వెళ్లేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారని నిలదీసినట్లు తెలిసింది. అయితే ఢీ చాంపియన్స్ లో కొత్తవారికి చాన్స్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.

news18-telugu
Updated: November 7, 2020, 6:35 PM IST
Dhee రాజు విషయంలో సుడిగాలి సుధీర్ సీరియస్....శేఖర్ మాస్టర్‌తో బిగ్ ఫైట్... రష్మీ చెప్పినా వినకుండా...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఢీ చాంపియన్స్ షో ఇఫ్పుడిప్పుడే సీరియస్ టర్న్ తీసుకుంటోంది. నిజానికి ఇన్ని రోజులు సరదా సరదాగా సాగిన ఢీ ఛాంపియన్స్ ఇప్పుడు సెమీ ఫైనల్ దశకు చేరుకుంది. అయితే సెమీఫైనల్ లో మాత్రం గొడవలు జరిగే వీలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢీ 10 చాంపియన్ గా నిలిచిన రాజు, ప్రస్తుతం సుడిగాలి సుధీర్ టీంలో ఉన్నాడు. అయితే రాజు అంటే ప్రాణం పెట్టి డాన్స్ చేస్తాడని అందరికీ తెలిసిందే..ఢీ 10 ఫైనల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ముందు సైతం రాజు తన సత్తా చాటి, టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అయితే రాజు విజయం వెనుక సుడిగాలి సుధీర్ ప్రోత్సాహం ఉంది అనేది అందరికీ తెలిసిందే. సుడిగాలి సుధీర్ కు కూడా రాజు అంటే ప్రాణం అనే చెప్పాలి. రాజు ఓ మామూలు డాన్సర్ స్థాయి నుంచి చిట్టీ మాస్టర్ దగ్గర సాన పెట్టిన కత్తిలా మారాడు. అంతేకాదు రాజు అంటే అటు ఫ్యాన్స్ లో కూడా ఫాలోయింగ్ భారీగా పెరిగిపోయింది. ఢీ ద్వారా యష్ మాస్టర్ తర్వాత అంత పేరు తెచ్చుకున్న డాన్సర్ ఎవరైనా ఉన్నారంటే అది రాజు అనే చెప్పాలి. అయితే రాజు విషయంలో అటు శేఖర్ మాస్టర్ కూడా మొదటి నుంచి ప్రోత్సాహం అందిస్తూనే వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఢీ చాంపియన్స్ లో పోటాపోటీగా షో సాగుతోంది. దీంతో ఢీ నిర్వాహకుల్లో కొందరు సెమీఫైనల్ లో రాజును తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుధీర్ తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా రాజు సెమీ ఫైనల్ కు వెళ్లేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారని నిలదీసినట్లు తెలిసింది. అయితే ఢీ చాంపియన్స్ లో కొత్తవారికి చాన్స్ ఇచ్చేందుకే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెప్పుకొచ్చారు. అయితే ఢీ రాజు విషయంలో శేఖర్ మాస్టర్ కూడా సుడిగాలి సుధీర్ కు చెప్పి చూసినట్లు తెలుస్తోంది. అయితే సుధీర్ మాత్రం శేఖర్ మాస్టర్ చెప్పినా వినడం లేదని తెలుస్తోంది. అయితే స్పెషల్ ఎంట్రీగా రాజును సెమీఫైనల్స్ లో కనిపించేలా చేస్తామని నిర్వాహకులు సుధీర్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అనవసరమైన గొడవల్లో తల దూర్చితే మంచిది కాదని రష్మీ చెప్పినా కూడా సుధీర్ వినిలేదని టాక్ వినిపిస్తోంది.
Published by: Krishna Adithya
First published: November 7, 2020, 6:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading