Home /News /movies /

SUDIGALI SUDHEER SENSATIONAL COMMENTS ON RASHMI GAUTAM IN A SHOW BS

రష్మీని మాత్రమే కౌగిలించుకుంటా.. సుడిగాలి సుధీర్ సంచలనం..

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)

రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)

రష్మీ గురించి సుడిగాలి సుధీర్ ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్‌గా సుధీర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అలీ వేసిన ఓ ఆసక్తికర ప్రశ్నకు షాకిచ్చే ఆన్సర్ ఇచ్చాడు సుధీర్.

    సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ అంటే బుల్లి తెర ప్రేక్షకుల హీరో, హీరోయిన్. వీరిద్దరు తెరపై కనిపిస్తే ఎప్పుడు కన్ను కొట్టుకుంటారా? ఎప్పుడు రొమాన్స్ పండిస్తారా? అని వేయి కళ్లతో ఎదురు చూస్తారు. ఏ షోలోనైనా సుధీర్ ఉంటే రష్మీ ఎక్కడ అని, రష్మీ ఉంటే సుధీర్ ఎక్కడ అని అడిగేవారు చాలా మందే ఉన్నారు. తెర మీద ఏ ఒక్కరు కనిపించినా వెలితిగానే ఉంటుంది. ఇద్దరు కలిసి ఉంటేనే షోకు కూడా అందం అని అంటారు కొందరు సినీ ప్రేక్షకులు. బుల్లి తెరపై వీరిద్దరికి ఉన్న క్రేజ్ ఏ స్టార్ హీరోకు కూడా లేదంటే అతిశయోక్తి కాదు. ఈ జంట తెరపై కనిపిస్తే చాలు కొంత మంది అభిమానులు ఖుషీ అవుతారు.. వారిద్దరు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు.. ఎప్పుడు ఆ శుభవార్త చెబుతారా? అని ఎదురు చూస్తున్న వారూ ఉన్నారు. యూట్యూబ్‌లో అయితే ఏకంగా వీళ్ల మధ్య ఏదేదో జరుగుతుందంటూ వార్తలు వండి వారుస్తారు. అయితే.. తమ ఇద్దరి మధ్య ఏం లేదని.. ఎవరి వ్యక్తిగత జీవితాల్లో వాళ్లం హ్యాపీగా ఉన్నామని ఈ జంట ఎప్పుడో స్పష్టం చేసింది.

    అయితే, తాజాగా.. రష్మీ గురించి సుడిగాలి సుధీర్ ఓ సంచలన వ్యాఖ్య చేశాడు. అలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అలీతో సరదాగా కార్యక్రమంలో గెస్ట్‌గా సుధీర్ పాల్గొన్నాడు. ఇందులో భాగంగా అలీ వేసిన ఓ ఆసక్తికర ప్రశ్నకు షాకిచ్చే ఆన్సర్ ఇచ్చాడు సుధీర్. దీపిక పదుకొన్‌ లేదా ప్రియాంక చోప్రాల్లో ఎవరిని కౌగిలించుకుంటావని ప్రశ్నించగా.. రష్మీ గౌతమ్ ఎక్కడ అని అడుగుతా అని అనడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇద్దరి మధ్య ఉన్న బంధం గురించి అడగ్గా.. ఏడేళ్ల ప్రయాణం తమదని వ్యాఖ్యానించాడు. ఈ షోలో తన ప్రేమ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశాడు సుధీర్. తాను ఐదో తరగతిలో ప్రపోజ్ చేయగా.. ఆమె 9వ తరగతిలో ఒప్పుకుందని, కానీ ఆమెకు పెళ్లై పోయిందని స్పష్టం చేశాడు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Jabardasth comedy show, Nagababu, Rashmi Gautam, Sudigali sudheer, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు