శ్రీముఖిపై ఫైర్ అయిన సుడిగాలి సుధీర్...బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు..

బిగ్ బాస్ షో గురించి సుధీర్‌ను అడిగితే మాత్రం మాటదాటవేశాడు. అసలు తాను బిగ్ బాస్ షో చూడనేలేదని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు శ్రీముఖి బిగ్ బాస్ లో రన్నర్ అప్ గా నిలిచినప్పటికీ, సుధీర్ తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు.

news18-telugu
Updated: November 9, 2019, 5:31 PM IST
శ్రీముఖిపై ఫైర్ అయిన సుడిగాలి సుధీర్...బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు..
శ్రీముఖిపై ఫైర్ అయిన సుడిగాలి సుధీర్...బిగ్‌బాస్‌పై సంచలన వ్యాఖ్యలు..
  • Share this:
జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయి ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇస్తున్న సుడిగాలి సుధీర్, సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ వెండితెరపై సందడి చేయనున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో సుధీర్ తెగ బిజీగా గడిపేస్తున్నాడు. తాను ఒక మామూలు ఆర్టిస్టు స్థాయి నుంచి హీరోగా ఎదగడం వెనుక చాలా కష్టపడ్డానని, తనకు ఇండస్ట్రీలో ప్రవేశించేందుకు మెగాస్టార్ చిరంజీవే స్ఫూర్తి అని సుధీర్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి సుధీర్‌ను అడిగితే మాత్రం మాటదాటవేశాడు. అసలు తాను బిగ్ బాస్ షో చూడనేలేదని సుడిగాలి సుధీర్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు శ్రీముఖి బిగ్ బాస్ లో రన్నర్ అప్ గా నిలిచినప్పటికీ, సుధీర్ తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించాడు. గతంలో శ్రీముఖి, సుధీర్ ఇద్దరూ కలిసి పలు కార్యక్రమాల్లో యాంకర్లుగా చేశారు. అయినప్పటికీ తనతో పాటు కెరీర్ మొదలు పెట్టిన శ్రీముఖి బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, సుధీర్ తనకేమి పట్టనట్లు కనీసం స్పందించేందుకు నిరాకరించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

First published: November 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>