SUDIGALI SUDHEER REACTION WHEN RASHMI GAUTHAM ASKS ABOUT HIS BEARD SK
రష్మీకి గుర్తుగానే గడ్డం పెంచా.. లాక్డౌన్ ఎంతో నేర్పిందన్న సుధీర్
రష్మీ, సుధీర్ (ETV Jabardasth)
కరోనా వల్ల బతకడం కష్టం అని అందరూ అంటున్నారని.. కానీ ఇష్టమైన వారికి దూరంగా బతకడం ఇంకా చాలా కష్టమని లాక్డౌన్ వల్ల తెలుసుకున్నట్లు సుడిగాలి సుధీర్ చెప్పాడు.
తెలుగు ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో దూరమై మూడు నెలలు గడిచింది. వారానికి రెండు రోజులుగా అందరినీ కడుపుబ్బా నవ్వించే ఈ ఖతర్నాక్ షో లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఐతే ప్రస్తుతం సినిమా, టీవీ షోల షూటింగ్‌లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో.. మళ్లీ షూటింగ్‌లు మొదలయ్యాయి. ఈ నెల 24 నుంచి తిరిగి బుల్లితెరపై సందడి చేయబోతోంది జబర్దస్త్. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు.. యూట్యూబ్‌లో రచ్చ చేస్తున్నాయి. కరోనాపై మనోళ్లు వేసే పంచులు పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి.
ఐతే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మీ గౌతమ్ టీమ్ లీడలర్లందరినీ పలకరిస్తుంది. లాక్డౌన్లో ఎలా గడిపారని.. లాక్డౌన్ వల్ల ఏం నేర్చుకున్నారని అడిగి తెలుసుకుంటుంది. ఐతే సుధీర్ గుబురు గడ్డంతో కనిపించడంతో.. గడ్డం ఎందుకు పెంచావ్ అని ప్రశ్నిస్తుంది. ప్రేమించిన వారికి గుర్తుగా గడ్డం పెంచానని చెప్పడంతో.. రష్మీ ముసిముసి నవ్వులు నవ్వుతుంది. అంతేకాదు కరోనా వల్ల బతకడం కష్టం అని అందరూ అంటున్నారని.. కానీ ఇష్టమైన వారికి దూరంగా బతకడం ఇంకా చాలా కష్టమని లాక్డౌన్ వల్ల తెలుసుకున్నట్లు సుడిగాలి సుధీర్ చెప్పాడు. ఆ మాటలు విన్న రష్మీీ గౌతమ్ ఉబ్బితబ్బిపోయింది. ఇదంతా స్క్రిప్టే అయినప్పటికీ... వీరిద్దరి జోడికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇద్దరు స్టేజిపై కనిపించడంతో... ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.