యాంకర్ రవి ఢీ షోలో ఎంటర్ అయినప్పటి నుంచి సుడిగాలి సుధీర్ తన గుర్తింపు కోసం పడని పాట్లంటూ లేవు. రవి ఎనర్జీతో మ్యాచ్ అవ్వడం కోసం సుధీర్ అనేక ఫీట్లు చేస్తున్నాడని ఇప్పటికే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా బుధవారం ప్రసారానికి సిద్ధంగా ఉన్న ఢీ షోలో సుడిగాలి సుధీర్ ఒక వెరైటీ ప్రయోగం చేశాడు. ఈ సారి జడ్జీలు అయిన శేఖర్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలను పక్కన పెట్టేసి సుడిగాలి సుధీరే డైరక్టుగా జడ్జీ స్థానంలో కూర్చున్నాడు. అంతేకాదు జడ్జి ప్రియమణిపై సుడిగాలి సుధీర్ వేసిన సెటైర్లకు అంతా షాక్ కు గురయ్యారు. ఢీ షోలో ప్రియమణికి ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఇవేవీ పట్టించుకొని సుడిగాలి సుధీర్ ప్రియమణి మేకప్ మీద జోకులేశాడు. అంతేకాదు ఆమె భాషను సైతం వెక్కిరించాడు. ఇదంతా జోక్ అనుకుంటూ అంతా నవ్వుకున్నప్పటికీ ప్రియమణి మాత్రం కాస్త సీరియస్ గానే కనిపించినట్లు సమాచారం. అయితే సుధీర్ పై ప్రియమణి సీరియస్ అయినప్పటికీ పక్కనే ఉన్న శేఖర్ మాస్టర్ కంట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు సుడిగాలి సుధీర్ మాత్రం ఇవేవి పట్టనల్లు వ్యవహరించడంపై ప్రియమణి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సుడిగాలి సుధీర్ పై విమర్శలు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhee Dance Reality Show, Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir