టాలీవుడ్‌లో ఉన్న యాంకర్స్‌లో ఇప్పుడిప్పుడే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ విష్ణు ప్రియ. ముఖ్యంగా సుడిగాలి సుధీర్‌తో ఉన్న దోస్తానా కారణంగా ఈమెకు మంచి ఫాలోయింగ్ వస్తుంది. పోవే పోరా షోతో బాగా పాపులర్ అవుతుంది విష్ణు. దాంతో పాటు మరిన్ని షోలలో కూడా తన సత్తా చూపిస్తుంది ఈమె. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు పర్సనల్ లైఫ్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంటుంది విష్ణు ప్రియ. బయటికి వెళ్లడం.. అక్కడ్నుంచి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానులకు మరింత దగ్గరవుతుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో పాటే హాట్ ఫోటోషూట్స్ కూడా బాగానే చేస్తుంది విష్ణు. ఈ తరం యాంకర్స్ అసలు మామూలుగా లేరు. హీరోయిన్ల కంటే తామేం తక్కువ కాదంటూ రెచ్చిపోతున్నారు. ఇప్పుడు ఈమె కూడా ఇదే చేసింది.
తాజాగా విష్ణు ప్రియ చేసిన ఫోటోషూట్ వైరల్ అవుతుంది. నడుము అందాలతో కొంటె నరకం చూపిస్తుంది విష్ణు ప్రియ. తాజాగా ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో అదిరిపోయే హాట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ పిచ్చెక్కిస్తుంది విష్ణు. ఇలాంటి హాట్ ఫోటోలు ఇదివరకు కూడా షేర్ చేసినా కూడా ఈ సారి మాత్రం నడుముతోనే మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల వరకు ఏమో కానీ ఇతర షోలు అయితే వస్తాయని నమ్ముతుంది ఈ బ్యూటీ.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor vishnupriya, Sudigali sudheer, Telugu Cinema, Tollywood