హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్‌కు షాక్...పోవే పోరా ప్రోగ్రాం నుంచి ఔట్..యాంకర్ విష్ణుప్రియకు జోడీ ఎవరంటే...

సుడిగాలి సుధీర్‌కు షాక్...పోవే పోరా ప్రోగ్రాం నుంచి ఔట్..యాంకర్ విష్ణుప్రియకు జోడీ ఎవరంటే...

(Image: Facebook)

(Image: Facebook)

సుధీర్ తో పెయిర్ అంటే రష్మీయే తప్ప విష్ణుప్రియ ఎంత ప్రయత్నించినా హాట్ పెయిర్ గా నిలవలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో విష్ణుప్రియకు మరో ఎనర్జిటిక్ యాంకర్ తోడు అయితే పోవే పోరా ప్రోగ్రాంకు కొత్త జోష్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇంకా చదవండి ...

పోవే పోరా ప్రోగ్రాం అంటే యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ ప్రోగ్రాం సక్సెస్ వెనుక సుడిగాలి సుధీర్, యాంకర్ విష్ణుప్రియ మధ్య ఉన్న కెమిస్ట్రీయే కారణమని తెలుస్తోంది. ఇద్దరూ కలిసి చేసే అల్లరి, అలాగే రొమాంటిక్ సాంగ్స్ చూసేందుకు యూత్ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే సుడిగాలి సుధీర్ కొత్త ప్లాన్స్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించిన సుడిగాలి సుధీర్, మరిన్ని సినిమాల్లో సైతం సోలో హీరోగా నటించేందుకు సిద్ధంగా ఉన్నాడట. సాఫ్ట్ వేర్ సుధీర్ బాక్సాఫీసు దగ్గర అంత హిట్ కాకపోయినా, కేవలం సుడిగాలి సుధీర్ క్రేజ్ తోనే లాభాలు గడించింది. దీంతో ఓ మంచి హిట్ కొడితే సుధీర్ కూడా ఓ మినిమం గ్యారంటీ హీరోగా అవతరించినా ఆశ్చర్యపోనవసరం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పటికే ఢీ, జబర్దస్త్ షోలతో బిజీగా ఉన్న సుధీర్ ఇకపై పోవే పోరా ప్రోగ్రాం వదులుకునే చాన్స్ ఉందని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అంతేకాదు పోవే పోరా ప్రోగ్రాం ఫార్మాట్ కూడా రొటీన్ కావడంతో ప్రేక్షకులు కొత్తదనం ఆశిస్తున్నారని, అంతేకాదు సుధీర్ తో పెయిర్ అంటే రష్మీయే తప్ప విష్ణుప్రియ ఎంత ప్రయత్నించినా హాట్ పెయిర్ గా నిలవలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. దీంతో విష్ణుప్రియకు మరో ఎనర్జిటిక్ యాంకర్ తోడు అయితే పోవే పోరా ప్రోగ్రాంకు కొత్త జోష్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే సుధీర్ ప్లేస్ లో ఎవరు ఉన్నారా అని ఆలోచిస్తే, ప్రస్తుతం విష్ణుప్రియకు జోడిగా మాస్ అవినాష్ ను తీసుకునే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. విష్ణుప్రియకు జోడీగా మాస్ అవినాష్ కలిసి క్యాష్ ప్రోగ్రాంలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇద్దరి మధ్య జగడం చాలా ఫన్ క్రియేట్ చేయడంతో పాటు, అవినాష్ మాస్ అప్పీల్ కూడా పోవే పోరాకు కలిసి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. అయితే మాస్ అవినాష్ కు జంటగా విష్ణుప్రియ అయితే సరిపోతుందని, ఇద్దరూ అల్లరి చేస్తే సీన్ మామూలుగా ఉండదనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు మాస్ అవినాష్ టాలెంట్ ను ముందే గుర్తించిన శ్రీముఖి ఇప్పటికే మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాంలో తన పక్కన యాంకరింగ్ చేసే చాన్స్ ఇచ్చింది. అంతేకాదు ఇప్పుడు మాస్ అవినాష్, శ్రీముఖి, విష్ణుప్రియ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ గా మారినట్లు కనిపిస్తోంది. అయితే వీరి కెమిస్ట్రీని వాడకుంటూ మరో ప్రోగ్రాం కూడా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Anchor vishnupriya, Sudigali sudheer

ఉత్తమ కథలు