తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో నుంచి ఇండస్ట్రీకి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు.
తెలుగు ఇండస్ట్రీలో జబర్దస్త్ కామెడీ షోకు ఉన్న ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క షో నుంచి ఇండస్ట్రీకి ఎంతమంది కమెడియన్లు వచ్చారనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పనిలేదు. టాలీవుడ్లో కొందరు సీనియర్ కమెడియన్లు ఇప్పుడు పనిలేకుండా ఉన్నారంటే దానికి కారణం ఈ జబర్దస్త్ టీమే. వాళ్లు తమ టాలెంట్‌తో వచ్చిన అవకాశాలు వాడుకుంటున్నారు. అందులో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ అయితే మరీనూ.. వీళ్లకు అభిమానులు కూడా ఉన్నారంటే మనోళ్ల రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీం లీడర్స్ మీద ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షోలో కుట్ర జరుగుతుందని ఈ మధ్యే సంచలన నిజాలు బయటపెట్టాడు నాగబాబు.
జబర్దస్త్ కామెడీ షో...
ఇదే విషయంపై ఇప్పుడు సుధీర్ కూడా ఓపెన్ అయ్యాడు. నాగబాబు తన వ్యక్తిగత కారణాలతో ఈ షో నుంచి బయటికి వెళ్లుండొచ్చు కానీ తమను వదిలేసి మాత్రం కాదని క్లారిటీ ఇచ్చాడు. ఆయన వెళ్లిపోవడం పూర్తిగా ఆయన పర్సనల్ కానీ దాన్ని తమతో కానీ.. షోతో కానీ కనెక్ట్ చేయొద్దంటున్నాడు ఈయన. జబర్దస్త్ ఉన్నంత వరకు తాను ఆ షోను వదిలే సమస్యే లేదంటున్నాడు సుధీర్. షోలో ఎవరున్నా లేకపోయినా.. ఎవరు వెళ్లిపోయినా కూడా తాను మాత్రం జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలనని క్లారిటీ ఇచ్చాడు.
జబర్దస్త్ లోగో
మరి నాగబాబు అంటే.. ఆయనతో తమకేంటి సంబంధం అంటున్నాడు. ఇప్పటికీ గురువులాగే నాగబాబును చూస్తామని.. ఆయన వెళ్లినంత మాత్రానా తాము కూడా వెళ్తామని ఎవరు చెప్పారని ప్రశ్నిస్తున్నాడు సుధీర్. ఈయన తాజాగా సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ చిత్ర ప్రమోషన్లో భాగంగా ఈయన ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేసాడు. నాగబాబు షోలో ఉన్నా లేకపోయినా ఎప్పటికీ తమకు సన్నిహితుడే అని.. ఆయన్ని ఇప్పటికీ మంచి చెడుల కోసం సలహాలు అడుగుతుంటామని చెప్పాడు సుధీర్.
నాగబాబు సుడిగాలి సుధీర్ హైపర్ ఆది
ఇక సినిమాలు చేసినా.. స్టార్ డమ్ వచ్చినా జబర్దస్త్ మాత్రం వదలనని మాట ఇస్తున్నాడు సుధీర్. అయితే నాగబాబు వర్షన్ మాత్రం మరోలా ఉంది. తనతో పాటు ఆ షో నుంచి మరికొందరు కూడా బయటికి రావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పాడు నాగబాబు. అందులో సుధీర్, హైపర్ ఆది లాంటి వాళ్లను అగ్రిమెంట్ పేరుతో అక్కడే లాక్ చేసారని చెప్పాడు మెగా బ్రదర్. కానీ ఇప్పుడు సుధీర్ మాత్రం జబర్దస్త్ నా ప్రాణం.. నాగబాబు వెళ్లినా తమ ప్రయాణం ఇక్కడే అంటున్నాడు. మొత్తానికి అంతా కలిసి ఇప్పుడు నాగబాబునే ఒంటరి చేసినట్లు అనిపిస్తుంది.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.