సుడిగాలి సుధీర్ జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాదు. అటు సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ద్వారా హీరోగా సైతం వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఒక మెజీషియన్ స్థాయి నుంచి పెద్ద సెలబ్రిటీ స్థాయికి ఎదిగిని సుడిగాలి సుధీర్‌కు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ తో పాటు అభిమానులు సైతం పెద్ద ఎత్తున ఉన్నారు. ఇదిలా ఉంటే సుధీర్ తాజాగా తన సినిమా ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నాడు. అంతేకాదు సుడిగాలి సుధీర్ ఈ మధ్యనే యాంకర్ సుమ నిర్వహించే క్యాష్ షోలో గెస్ట్ గా పాల్గొన్నాడు. ఆ షోలో యాంకర్ సుమ వేసిన చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పలేక షో నుంచి దాదాపు పారిపోయేంత పరిస్థితి సుధీర్‌కు వచ్చేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక సుమను వదిలేయమని బతిమిలాడినట్లు సమాచారం. గేమ్ లో భాగంగా ఒక టాస్క్ లో సుమ వేసిన ప్రశ్నకు సుధీర్ దిమ్మ తిరిగిపోయింది. ఆ ప్రశ్నకు కనుక సమాధానం చెప్పి ఉంటే ఇండస్ట్రీలోనే ఒక పెద్ద కమెడియన్‌ను విమర్శించినట్టే లెక్క. నిజంగా సుధీర్ ఆ ప్రశ్నకు ఆన్సర్ చేస్తే మాత్రం ఇండస్ట్రీలో పెద్ద దుమారం లేచి ఉండేది. అయితే సుధీర్ మాత్రం తెలివిగా ఆన్సర్ చెప్పకుండానే తప్పించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir