సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్...వధువుది ఏ జిల్లా అంటే..లాక్‌డౌన్‌ గ్యాప్‌లో కుదిరిన మ్యాచ్...

నిత్యం షూటింగుల్లో బిజీగా ఉండే సుధీర్ కు గత మూడు నెలలుగా కరోనా పుణ్యమా అంటూ పని లేకుండా పోయింది. అయితే ఈ టైమ్ ను సుధీర్ వేస్ట్ చేసుకోదలచలేదు. ఈ గ్యాప్ లో పెళ్లి సంబంధం సెట్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం.

news18-telugu
Updated: May 21, 2020, 5:08 PM IST
సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్...వధువుది ఏ జిల్లా అంటే..లాక్‌డౌన్‌ గ్యాప్‌లో కుదిరిన మ్యాచ్...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) టాలివుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అని చెప్పవచ్చు. సుధీర్ (Sudigali Sudheer) పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు. అలాంటి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) మాత్రం రష్మీ(Rashmi Gautam)పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లిపై మాత్రం అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్(Auto Ram Prasad) , గెటప్ శ్రీను(Getup Srinu) మాత్రం కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నారు. అయితే నిత్యం షూటింగుల్లో బిజీగా ఉండే సుధీర్ కు గత మూడు నెలలుగా కరోనా పుణ్యమా అంటూ పని లేకుండా పోయింది. అయితే ఈ టైమ్ ను సుధీర్ వేస్ట్ చేసుకోదలచలేదు. ఈ గ్యాప్ లో పెళ్లి సంబంధం సెట్ చేసుకునే పనిలో పడ్డట్టు సమాచారం. సన్నిహితులు ద్వారా వస్తున్న టాక్ ప్రకారం సుధీర్ వయస్సు ఇప్పటికే 32 దాటిపోయింది. రెండు రోజుల క్రితమే సుధీర్ 33వ ఏట అడుగు పెట్టేశాడు. ఇంకేముంది బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా దేనికీ పనికి రాదు అనే సామెత గుర్తొచ్చిందేమో..వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయాడు. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా కొన్ని మ్యాచెస్ చూసినట్లు తెలుస్తోంది. అయితే ఒక మ్యాచ్ సుధీర్ కు తెగ నచ్చేసిందని ఓకే కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇక అమ్మాయి వివరాల్లో వెళితే అమ్మాయి సుధీర్ సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది. సుధీర్ తో జాతకం కూడా మ్యాచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే త్వరలోనే సుధీర్ పెళ్లికాబోతున్నాడన్నమాట.
Published by: Krishna Adithya
First published: May 21, 2020, 5:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading