ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) టాలివుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అని చెప్పవచ్చు. సుధీర్ (Sudigali Sudheer) పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు. అలాంటి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) మాత్రం రష్మీ(Rashmi Gautam)పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లిపై మాత్రం అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్(Auto Ram Prasad) , గెటప్ శ్రీను(Getup Srinu) మాత్రం కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నారు. అయితే రాంప్రసాద్, గెటప్ శ్రీను మాత్రం సుధీర్ పెళ్లి గురించి తరచూ చెబుతున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో రాంప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం సుడిగాలి సుధీర్ పెళ్లిసంబంధాలు వెతుకుతు న్నామని చెప్పుకొచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో అందరికన్నా సీనియర్ బ్రహ్మచారి ప్రదీప్ (Pradeep Machiraju) అని చెబుతూనే, సుడిగాలి సుధీర్ కోసం విదేశాల్లో సైతం పెళ్లి సంబంధాలు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. (Jabardasth) అయితే ఇది సరదాగా అన్నారా...లేక నిజంగానే సుడిగాలిసుధీర్ కోసం విదేశీ వనితను వెతుకుతున్నారా అనేది తేలాల్సి ఉంది. ఇదిలా ఉంటే సుడిగాలి సుధీర్ విదేశీ వనితను చేసుకుంటే మాత్రం అతడి ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఎందుకుంటే సుధీర్, రష్మీ ఒక్కటవ్వాలని చాలామంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తేలాల్సి ఉంది.
ఇదిలా ఉంటే ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ పండిచడంలో ఈ మధ్య టెలివిజన్ యాంకర్స్, సినిమా తారలను మించిపోతున్నారు. గత కొంతకాలంగా సుడిగాలి సుధీర్, అలాగే మరో యాంకర్ విష్ణుప్రియ (Vishnupriya) ఇలా ఆన్ స్క్రీన్ మీద తమ కెమిస్ట్రీ బాగా కుదరడంతో తెగ రెచ్చిపోతున్నారు. సినిమాల్లోని డ్యూయెట్స్ అన్నింటిని రీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకేముంది ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ డ్యూయెట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ పెళ్లిచూపుల సెటప్ తో పోవేపోరా(Pove Pora) ప్రోమోలో అదరగొట్టాడు. ఇందులో సుధీర్, విష్ణుప్రియ(Anchor Vishnupriya) పెళ్లిచూపులు హైలైట్ అనే చెప్పాలి. అయితే సుడిగాలి సుధీర్ ఎప్పటి లాగా తన పాత్రలో ఒదిగిపోగా, విష్ణుప్రియ సైతం కొంటెచూపులతో తెగ ఆకట్టుకుందనే చెప్పాలి.
సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) ను ఈ ప్రోమోలో చూసిన ఫ్యాన్స్ ఇదంతా నిజం అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. ప్రతిరోజూ పండగ సినిమాలో ఓ బావా అంటూ విష్ణుప్రియ రెచ్చిపోవడంతో సుధీర్ సిగ్గుల మొలకవ్వడం ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. ఇలా సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేందుకు విష్ణు ప్రియ కూడా తెగ ప్రయత్నిస్తోంది. అయితే పోవే పోరా ద్వారా విష్ణుప్రియ తెగ రెచ్చిపోతూ తన అందచందాలను ప్రదర్శిస్తోంది. సుడిగాలి సుధీర్ అటు సినిమాల్లో కూడా తన పెర్ఫార్మన్స్ తో అదరగొడుతున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.