SUDIGALI SUDHEER MARRIAGE FIX HERE ARE THE DETAILS MK
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెళ్లి ఫిక్స్, ఏ జిల్లా అమ్మాయో తెలిస్తే అందరూ షాక్ తింటారు...
Sudigali Sudheer
సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయాడు. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా కొన్ని మ్యాచెస్ చూసినట్లు తెలుస్తోంది. అయితే ఒక మ్యాచ్ సుధీర్ కు తెగ నచ్చేసిందని ఓకే కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది.
జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మనోడికి బుల్లితెరపై మెగా ఇమేజ్ ఉంది. సంపాదనలో కూడా హీరోలతో పోటీ పడుతున్నాడు. నెలకు లక్షల్లో.. ఏడాదికి కోట్లల్లోకి చేరిపోయింది సుధీర్ సంపాదన. జబర్దస్త్‌కు ముందు చిన్న చిన్న మ్యాజిక్కులు చేసుకునే సుధీర్.. ఆ తర్వాత మెల్లగా ఎదిగాడు. ఇప్పుడు ఈయన రేంజ్ ఏంటో కళ్ల ముందే కనిపిస్తుంది. ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈటీవీ అయితే పూర్తిగా సుధీర్ మీదే ఆధారపడిందేమో అనేంతగా ఆయనతోనే ఈవెంట్స్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా సుధీర్ తప్ప మరొకరు కనిపించడం లేదు. సుడిగాలి సుధీర్ అనేది ఇప్పుడు బుల్లితెరపై బ్రాండ్ అయిపోయింది.
ఎప్పుడొచ్చాం కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అని మహేష్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు సుధీర్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎలా వచ్చాం.. ఎక్కడ్నుంచి వచ్చాం.. అనేది కాదు ఎలా ఎదిగాం.. ప్రస్తుతం మనమెక్కడున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సుధీర్ కూడా ఇదే చేసి చూపించాడు. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతోమంది కమెడియన్స్ తెలుగు తెరకు వచ్చారు.. వెళ్లిపోయారు కానీ కొందరు మాత్రమే అక్కడే సెటిల్ అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన నటుడు సుడిగాలి సుధీర్. ఏడేళ్లుగా తెలుగు ప్రేక్షకులను తన కామెడీ టైమింగ్‌తో నవ్విస్తూనే ఉన్నాడు.
ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) టాలివుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అని చెప్పవచ్చు. సుధీర్ (Sudigali Sudheer) పెళ్లి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అనే చెప్పవచ్చు. అలాంటి సుడిగాలి సుధీర్ పెళ్లి గురించి ఎన్నెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) మాత్రం రష్మీ(Rashmi Gautam)పై మనసు పారేసుకున్నాడని అందుకే, పెళ్లిని వాయిదా వేస్తున్నాడనే వార్తలు గత కొంత కాలంగా నెట్టింట షికారు చేశాయి. అయితే సుడిగాలి సుధీర్ పెళ్లిపై మాత్రం అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్(Auto Ram Prasad) , గెటప్ శ్రీను(Getup Srinu) మాత్రం కాస్త సీరియస్ గానే ట్రై చేస్తున్నారు.
సన్నిహితులు ద్వారా వస్తున్న టాక్ ప్రకారం సుధీర్ వయస్సు ఇప్పటికే 34 దాటిపోయింది. ఇంకేముంది బెండకాయ ముదిరినా, బ్రహ్మచారి ముదిరినా దేనికీ పనికి రాదు అనే సామెత గుర్తొచ్చిందేమో..వెంటనే సుధీర్ పెళ్లి సంబంధాల వేటలో పడిపోయాడు. తాజాగా తమ ఫ్యామిలీకి చెందిన సన్నిహితుల ద్వారా కొన్ని మ్యాచెస్ చూసినట్లు తెలుస్తోంది. అయితే ఒక మ్యాచ్ సుధీర్ కు తెగ నచ్చేసిందని ఓకే కూడా చెప్పేసినట్లు తెలుస్తోంది. ఇక అమ్మాయి వివరాల్లో వెళితే అమ్మాయి సుధీర్ సొంత జిల్లాకు చెందిన యువతే అని తెలుస్తోంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.