జబర్దస్త్ కామెడీ షో నుంచి ముగ్గురు హీరోలు ఒకేసారి వస్తున్నారుగా..

తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ కామెడీ షోకు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో నుంచి చాలా మంది అనామకుల నుంచి ఆస్తిపరులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా అయ్యారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 9:12 PM IST
జబర్దస్త్ కామెడీ షో నుంచి ముగ్గురు హీరోలు ఒకేసారి వస్తున్నారుగా..
హీరోలుగా మారిన జబర్దస్త్ కమెడియన్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 9:12 PM IST
తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ కామెడీ షోకు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో నుంచి చాలా మంది అనామకుల నుంచి ఆస్తిపరులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా అయ్యారు. ఆరు నుంచి అరవై వరకు అంతా జబర్దస్త్ షోకు ఫ్యాన్సే. గురువారం, శుక్రవారం వచ్చిందంటే చాలు.. టీవీల ముందు అతక్కుపోతారు. తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ ఉన్న ప్రోగ్రామ్‌‌గా కొన్నేళ్లుగా చరిత్రను తిరగరాస్తుంది ఈ షో. ఇక ఇందులో నుంచి వచ్చి స్టార్స్‌గా ఎదిగిన వాళ్లు చాలా మంది ఉన్నారు. హీరోలు కూడా అయ్యారు కొందరు.

Sudigali Sudheer Mahesh Chammak Chandra becoming heroes from Jabardasth Comedy Show at a time pk తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ కామెడీ షోకు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో నుంచి చాలా మంది అనామకుల నుంచి ఆస్తిపరులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా అయ్యారు. jabardasth,jabardasth comedy show,extra jabardasth,extra jabardasth comedy show,sudigali sudheer,chammak chandra,mahesh achanta jabardasth,software sudheer movie,chammak chandra jabardasth comedian,nenu naa nagarjuna mahesh,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ (Source: Twitter)

వాళ్లు సక్సెస్ అయ్యారా లేదా అనేది పక్కనబెడితే హీరోలు అయితే చాలా మంది అయ్యారు. ఇప్పటికే షకలక శంకర్ హీరోగా నటిస్తుండగా.. ధన్‌రాజ్, చలాకీ చంటి, రాకెట్ రాఘవ, హైపర్ ఆది లాంటి వాళ్లంతా సినిమాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఒకసారి ఈ షో నుంచి సోలో హీరోలుగా వస్తున్నారు. ఇందులో సుడిగాలి సుధీర్ ముందుంటాడు.

Sudigali Sudheer Mahesh Chammak Chandra becoming heroes from Jabardasth Comedy Show at a time pk తెలుగు రాష్ట్రాలలో జబర్ధస్త్ కామెడీ షోకు ఉన్న పాపులారిటీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో నుంచి చాలా మంది అనామకుల నుంచి ఆస్తిపరులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా అయ్యారు. jabardasth,jabardasth comedy show,extra jabardasth,extra jabardasth comedy show,sudigali sudheer,chammak chandra,mahesh achanta jabardasth,software sudheer movie,chammak chandra jabardasth comedian,nenu naa nagarjuna mahesh,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,తెలుగు సినిమా
మహేష్ ఆచంట (Source: Twitter)
సాఫ్ట్ వేర్ సుధీర్ అంటూ ఈయన ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇదే ఏడాది విడుదల కానుంది. ఇక మరో కమెడియన్ చమ్మక్ చంద్ర కూడా రామ సక్కనోళ్లు సినిమాతో హీరో అయ్యాడు. ఇప్పుడు రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట కూడా హీరోగా మారిపోయాడు. ఈయన నటిస్తున్న నేను నా నాగార్జున అంటూ వస్తున్నాడు. ఒకేసారి ముగ్గురు కమెడియన్లు హీరోలుగా మారడం చిన్న విషయం కాదు.. మరి వాళ్లు వెండితెరపై ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలిక.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...