హోమ్ /వార్తలు /సినిమా /

హైపర్ ఆది చేసిన అవమానానికి సుడిగాలి సుధీర్ ఫైర్...నేను దొరబాబు కాదంటూ సీరియస్...

హైపర్ ఆది చేసిన అవమానానికి సుడిగాలి సుధీర్ ఫైర్...నేను దొరబాబు కాదంటూ సీరియస్...

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)

సుడిగాలి సుధీర్,హైపర్ ఆది (Sudigali Sudheer Hyper Aadi)

సరదాగా ఉండే సుడిగాలి సుధీర్ తన టెంపర్ కోల్పోయాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉగాది స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది ఎప్పటి లాగే సుడిగాలి సుధీర్ పై కామెంట్స్ చేస్తూ పంచ్ వేశాడు.

ఎప్పుడూ సరదాగా ఉండే సుడిగాలి సుధీర్ తన టెంపర్ కోల్పోయాడనే వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఉగాది స్పెషల్ ప్రోగ్రాంలో హైపర్ ఆది ఎప్పటి లాగే సుడిగాలి సుధీర్ పై కామెంట్స్ చేస్తూ పంచ్ వేశాడు. అందులో సుడిగాలి సుధీర్ కు కాస్త ఘాటుగానే పంచ్ తగిలింది. అందులో సుధీర్ ను ఉద్దేశించి హైపర్ ఆది టెలికాస్ట్ కాని పర్సనల్ ఈవెంట్స్ పెర్ఫార్మ్ చేస్తావా అంటూ కామెంట్ చేశారు. దీనికి సుధీర్ షాక్ కు గురైనట్లు కనిపించింది. అయితే ఈవెంట్ మధ్యలోనే సుధీర్ కాస్త సీరియస్ అయినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. తాను హైపర్ ఆది టీమ్ మేట్ దొరబాబులా కాదని, అందరూ హైపర్ ఆది టీమ్ మెంబర్స్ లా ఉండరని సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో హైపర్ ఆది కూడా దిగ్భ్రాంతికి గురైనట్లు తెలుస్తోంది. అయితే తన కేరక్టర్ పై గతంలో అందరూ జోకులు వేసినప్పటికీ, గతంలో సుధీర్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఇటీవల సెక్స్ రాకెట్ విషయంలో దొరబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఇది ఒకరకంగా చెప్పాలంటే హైపర్ ఆది టీమ్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ హైపర్ ఆది గతంలో దొరబాబు కేరక్టర్ పై ఇలాగే జోకులు వేశాడు. కానీ దొరబాబు నిజజీవితంలో కూడా అలాంటి వాడే అని తేలిపోయింది. అయితే ఇప్పుడు హైపర్ ఆది అలాంటి కామెంట్స్ చేయడంతో తన కేరక్టర్ ను కూడా దొరబాబుతో పోల్చినట్లు సుధీర్ ఫీలయినట్లు సమాచారం.

అయితే సుధీర్ నిజానికి నిజజీవితంలో చాలా పద్ధతిగా ఉంటాడని బయట టాక్ ఉంది. అతడి ఫాలోయింగ్ కూడా ఎక్కువే..ఇటీవలే రెండు సినిమాల్లో హీరోగా నటించాడు. ఈ నేపథ్యంలో తన కేరక్టర్ బ్యాడ్ చేస్తే ఫ్యాన్స్ ఫీలవుతారని సుధీర్ భావించినట్లు తెలుస్తోంది.

First published:

Tags: Hyper Aadi, Hyper Adi, Jabardasth, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు