బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వాళ్లెప్పుడు కనిపించినా కూడా రేటింగ్స్ కూడా భారీగానే వస్తుంటాయి. అలాంటిది రష్మిని సుధీర్ వదిలేయడం ఏంటి.. వింత కాకపోతేనూ అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరుగుతుంది మరి. తాజాగా సుధీర్ సోలో పర్ఫార్మెన్సులు ఇస్తున్నాడు. రష్మి లేకుండానే డాన్సులు చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అవుతున్నాయి. యూ ట్యూబ్ కూడా షేక్ అయిపోతుంది.
తాజాగా పండగ సర్ పండగ అంతే ఈవెంట్ కోసం సుడిగాలి సుధీర్‌నే మరోసారి సెంటర్ చేసారు. ఈయనపైనే కామెడీ అంతా వర్కవుట్ చేసారు. ఈటీవీ ఉగాది కానుకగా ఈ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఇందులో విచిత్రం ఏంటంటే రష్మి గౌతమ్ లేకపోవడం.. ఆమె లేకుండానే సుడిగాలి సుధీర్‌కు మరో ఇద్దరు భామలను ఇచ్చారు. ఒకరు పోవే పోరా విష్ణు ప్రియ అయితే.. మరొకరు వర్షిణి. ఈ ఇద్దరితోనూ సుధీర్ అదిరిపోయే కామెడీ చేసాడు. దాంతో పాటు బాలయ్య స్వాతిలో ముత్యమంత పాటకు డాన్సులు కూడా కుమ్మేసాడు.
ముఖ్యంగా ఈ పాటలో ఢీ ఛాంపియన్స్ డాన్సర్ సుధీర్‌తో పాటు స్టెప్పులు వేసింది. కానీ అక్కడ రష్మి గౌతమ్ ఉండుంటే మాత్రం రేంజ్ మరోలా ఉండేదంటున్నారు ఫ్యాన్స్. సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్ మధ్య ఉండే కెమిస్ట్రీ అలాంటిది మరి. ప్రతీ పాటలోనూ అదిరిపోయే కెమిస్ట్రీతో పిచ్చెక్కించింది ఈ జోడీ. అందుకే ఈ పాటలో కూడా రష్మి, సుధీర్ ఉండుంటే మరోలా ఉండేదంటున్నారు. కానీ ఏం చేస్తాం.. ఇక్కడ రష్మిని వదిలేసాడు సుడిగాలి సుధీర్. ఆమెను కాదని మరో భామతో రొమాన్స్ చేసాడు. అది కూడా అదిరిపోయే వాన పాటలో.. ఇది చూసి రష్మి ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయ్యారేమో మరి..? ఎందుకంటే అక్కడున్నదెవరైనా కూడా సుధీర్ రొమాన్స్ మాత్రం అలాగే ఉంటుంది మరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor rashmi gautam, Jabardasth comedy show, Sudigali sudheer, Telugu Cinema, Tollywood