SUDIGALI SUDHEER JABARDASTH STAR ROMANCE WITH POVEPORA FAME VISHNU PRIYA WITH DANG DANG SONG MK
సుడిగాలి సుధీర్‌కు హాట్ యాంకర్ బంపర్ ఆఫర్...రాత్రంతా పార్టీ చేసుకుందామని...
దాంతో వెండితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే 'సాఫ్ట్వేర్ సుధీర్'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ తర్వాత తన ఇద్దరు మిత్రులు శ్రీను, రాంప్రసాద్‌తో కలిసి 3 మంకీస్ సినిమాలో కూడా నటించాడు.
సుడిగాలి సుధీర్‌కు హాట్ యాంకర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇంట్లో రాత్రంతా పార్టీ చేసుకుందామని వచ్చేయమని ఆహ్వానించింది. ఇంకేముంది మరి సుధీర్‌ను ఆపగలమా...
బుల్లితెరపై సుడిగాలి సుధీర్, రష్మి కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కామెడీ, రొమాన్స్, డాన్స్ ఇలా ఏది చేయాలన్నా ఈ ఇద్దరూ మునిగిపోయి జీవిస్తారు. అంతేకాదు రొమాంటిక్ సాంగ్స్ లో అయితే ఏకంగా జంట ప్రేమికుల్లా రెచ్చిపోతారు. ఆన్ స్క్రీన్‌పైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని గాసిప్స్ ఢీ షోలో వీరి జోడీ యాంకరింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అయితే సుధీర్‌తో రష్మీనే కాదు.. తాను కూడా కెమిస్ట్రీ పండించగలను అని యాంకర్ విష్ణుప్రియ పోవేపోరా కార్యక్రమం ద్వారా నిరూపించుకుంది. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఆజ్ మేరే ఘర్ మే పార్టీ హై తూ ఆజానా అంటూ సుడిగాలి సుధీర్ ను రెచ్చగొట్టింది. పోవేపోరా కొత్త ప్రోమాలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తమన్నా, మహేష్ జంట పుట్టించిన డ్యాంగ్ డ్యాంగ్ పాటను సుధీర్, విష్ణుప్రియా రీక్రియేట్ చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మల్లెమాల సమర్పిస్తున్న సుధీర్, విష్ణు ప్రియ జోడీగా ‘పోవే పోరా’ అనే కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకుల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.