జబర్దస్త్ కమెడియన్, సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా హీరో సుడిగాలి సుధీర్ అంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా కూడా విడుదలకు సిధ్దంగా ఉంది. అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ తన జీవితంలోని అనేక కోణాల గురించి చెబుతున్నాడు. తాజాగా ఆలీగా సరదాగా షోలో పాల్గొన్న సుధీర్ తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. అమ్మాయిల విషయంలో పులిహార కలపడంలో సుధీర్ సిద్ధహస్తుడు అని సరదాగా అతడి సన్నిహితులు అంటుంటారు. మరి అలాంటి సుధీర్ జీవితంలో కూడా ఒక లవ్ స్టోరీ ఉందని కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు తాను నాలుగేళ్లు సిన్సియర్ గా లవ్ చేసిన అమ్మాయి కోసం ఇంకా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.
తమది స్కూల్ ఏజ్ నుంచి కొనసాగుతున్న లవ్ అని ఇప్పట్లో విడిపోయేది కాదని సుధీర్ కుండబద్దలు కొట్టేశాడు. మరి ఆ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తుందా అంటే మాత్రం సమాధానం చెప్పలేదనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సుడిగాలి సుధీర్ పెళ్లి కోసం అతడి అభిమానులు వెయిట్ చేస్తుండగా, అటు అతడి స్నేహితులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను సైతం సంబంధాలు చూస్తున్నామని ఇప్పటికే చెప్పేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Jabardasth comedy show, Jabardasth ramprasad, Rashmi Gautam, Sudigali sudheer, Sudigali Sudhir