సుడిగాలి సుధీర్ భామకు నిద్రపట్టడం లేదట...ఆ రాత్రి గోవాలో...ఏం జరిగిందంటే..?

సుడిగాలి సుధీర్ (Source: Twitter)

నలుగురు అమ్మాయిల లైఫ్ స్టయిల్ తో పాటు పక్కా బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతుంది. అంతేకాదు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంది అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.

  • Share this:
    సుడిగాలి సుధీర్ సరసన నటించిన భామ ధన్య బాలక్రిష్ణ, నటిస్తున్న మరో చిత్రం అనుకున్నది ఒక్కటి...అయినది ఒక్కటి. ధన్య బాలకృష్ణ, త్రిధా చౌదరి, సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన పాత్రధారులు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌, పూర్వీ పిక్చర్స్‌ పతాకంపై బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో హిమబిందు వెలగపూడి, వేగి శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ప్రారంభం అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్ ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునేలా ఉంది. నలుగురు అమ్మాయిల లైఫ్ స్టయిల్ తో పాటు పక్కా బోల్డ్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతుంది. అంతేకాదు ఈ సినిమాలో క్రైమ్ థ్రిల్లర్ కూడా ఉంది అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. నలుగురు అమ్మాయిలు గోవా వెళ్లగా. అక్కడ ఏం జరిగింది.. ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నారు. అనే ఎమోషన్స్ ను కూడా బాగానే ఎలివేట్ చేశారు. అటు యూట్యూబ్ లో ఈ ట్రైలర్ బాగా ట్రెండ్ అవుతోంది.

    Published by:Krishna Adithya
    First published: