Home /News /movies /

SUDIGALI SUDHEER JABARDASTH SHOW COMEDIAN SUDIGALI SUDHEER SKIT MADES SUPER STAR KRISHNA MAHESH BABU FANS ANGRY HERE ARE THE DETAILS TA

Sudigali Sudheer : జబర్దస్త్ షోలో హీరో కృష్ణకు అవమానం.. సుడిగాలి గాలి సుధీర్ పై మండిపడుతున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్..

జబర్ధస్త్ షోలో సూపర్ స్టార్ కృష్ణకు అవమానం సుధీర్ పై మండిపాటు (Twitter/Photo)

జబర్ధస్త్ షోలో సూపర్ స్టార్ కృష్ణకు అవమానం సుధీర్ పై మండిపాటు (Twitter/Photo)

Sudigali Sudheer : జబర్దస్త్ షోలో హీరో సూపర్ కృష్ణకు అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి గాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్  స్టార్ ఫ్యాన్స్  మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. 

    Sudigali Sudheer : జబర్దస్త్ షోలో హీరో సూపర్ కృష్ణకు అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి గాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్  స్టార్ ఫ్యాన్స్  మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..  జబర్ధస్త్ షో విషయానికొస్తే.. ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ ఎక్కువ మటుకు బడా హీరోలను సినిమాలకు సంబంధించిన సీన్స్‌ను స్కిట్స్‌గా చేస్తూ ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు. అతి స్వర్ణత్రా వర్ణేయేత్ అన్నట్టు అవి పరిధి దాటనంత వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా ఈ శుక్రవాంర ఈటీవీలో ప్రసారమైన ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి చేసిన ఓ స్కిట్ సూపర్ స్టార్ అభిమానులను నొచ్చుకునేలా చేసింది.

    ప్రతి  ఫ్రైడే రోజున ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’లో సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అంతేకాదు ఈ షోలో సుడిగాలి సుధీర్, రష్మి గౌతమ్‌తో చేసే ఆన్ స్క్రీన్ రొమాన్స్ కూడా ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ షోలో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అమ్మ దొంగా’ సినిమాలోని ‘నీతో సాయంత్రం ఎంతో సంతోషం’ అనే పాటను పేరడీగా చేసారు. ఈ పేరడీ స్కిట్‌లో హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌కు భంగకరమయ్యే రీతిలో సుడిగాలి సుధీర్ టీమ్ ప్రవర్తించిందని సూపర్ స్టార్ అభిమానులు సుడిగాలి సుధీర్‌తో పాటు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ పై ఒకింత ఆగ్రహంగా ఉన్నారు. మరి దీనిపై సుడిగాలి సుధీర్ ఎలాంటి వివరణ ఇస్తాడనేది చూడాలి.

    సుడిగాలి సుధీర్ విషయానికొస్తే.. టీవీ తెరపై  మంచి క్రేజ్ ఉన్న కమెడియన్. ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.. ఆ త‌రువాత నిదానంగా స్మాల్ స్క్రీన్ పై  ఎంట్రీ ఇచ్చారు. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సుధీర్‌కి మంచి పేరు రాగా.. హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక హీరోగా ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో సుధీర్ న‌టించారు. అయితే అవి పెద్ద విజ‌యం సాధించ‌క‌పోగా.. హీరోగా త‌న అదృష్టాన్ని ఇంకా ప‌రీక్షించుకుంటున్నాడు.  ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా సుధీర్ పేరు సుడిగాలి సుధీర్‌గా మారింది. ఈ పేరుతోనే ఇప్పుడు టీమ్ లీడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగతి తెలిసిందే కదా.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jabardasth comedy show, Mahesh babu, Sarkaru Vaari Paata, Sudigali sudheer, Super Star Krishna, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు