జబర్దస్త్‌ను సుడిగాలి సుధీరే కాపాడాలి..హ్యాండిచ్చిన హైపర్ ఆది, అనసూయ

జబర్దస్త్ రష్మి, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)

సుడిగాలి సుధీర్ టీమ్, యాంకర్ రష్మీలు మాత్రం జబర్దస్త్ ను వదిలడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన జబర్దస్త్‌ ద్వారా ఓ వెలుగు వెలిగిన హైపర్ ఆది, అలాగే యాంకర్ అనసూయలు మల్లెమాలకు హ్యాండిస్తున్నట్లు సమాచారం.

  • Share this:
    జబర్దస్త్ అంటే తెలుగు టెలివిజన్ చరిత్రలో ఒక సంచలనం. ఈ షో ఎంతో మంది జీవితాలనే మార్చేసింది. రాత్రికి రాత్రే సెలబ్రిటీలను తయారు చేసింది. ఈ షో మొదలై ఇప్పటికే దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అవ్వనున్నాయి. అయినప్పటికీ ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ మంచి పేరు సంపాదించుకొని, సినిమా ఇండస్ట్రీలో సైతం అగ్ర కమెడియన్స్ గా వెలుగొందుతున్నారు. అయితే మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన జబర్దస్త్‌కు పోటీగా ఎన్నో కామెడీ షోలు ఇతర చానెల్స్ లో వచ్చినప్పటికీ దాని ముందు పోటీకి నిలవలేకపోయాయి. అయితే తాజాగా జీ తెలుగు సైతం జబర్దస్త్ తరహాలో ఓ కామెడీ షో తయారు చేసి ప్రోమో విడుదల చేసింది. కాగా గతంలో మాదిరి కాకుండా జబర్దస్త్ టీమ్‌లను తమ ప్రొగ్రాంలోకి ప్రవేశ పెట్టి ఆ కామెడీ షో హిట్ చేయాలనేది వారి ప్రయత్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి జబర్దస్త్ లో స్ట్రాంగ్ టీములుగా అటు హైపర్ ఆది టీమ్, అలాగే సుడిగాలి సుధీర్ టీమ్ లు బలంగా ఉన్నాయి. కాగా ఇఫ్పటికే హైపర్ ఆదితో పాటు యాంకర్ అనసూయను సైతం తమ ప్రోగ్రామ్ లోకి లాగేయడంలో ఆ చానెల్ విజయవంతం అయ్యిందనే టాక్.

    కానీ సుడిగాలి సుధీర్ టీమ్, యాంకర్ రష్మీలు మాత్రం జబర్దస్త్ ను వదిలడం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కన జబర్దస్త్‌ ద్వారా ఓ వెలుగు వెలిగిన హైపర్ ఆది, అలాగే యాంకర్ అనసూయలు మల్లెమాలకు హ్యాండిస్తున్నట్లు సమాచారం.
    Published by:Krishna Adithya
    First published: