ఆన్ స్క్రీన్ మీద రొమాన్స్ పండిచడంలో ఈ మధ్య టెలివిజన్ యాంకర్స్, సినిమా తారలను మించిపోతున్నారు. గత కొంతకాలంగా సుడిగాలి సుధీర్, అలాగే మరో యాంకర్ విష్ణుప్రియ ఇలా ఆన్ స్క్రీన్ మీద తమ కెమిస్ట్రీ బాగా కుదరడంతో తెగ రెచ్చిపోతున్నారు. సినిమాల్లోని డ్యూయెట్స్ అన్నింటిని రీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకేముంది ప్రస్తుతం ఫ్యాన్స్ ఈ డ్యూయెట్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా సుడిగాలి సుధీర్ పోవేపోరా ప్రోమోలో అదరగొట్టాడు. ఇందులో సుధీర్, విష్ణుప్రియ హైలైట్ అనే చెప్పాలి. అయితే సుడిగాలి సుధీర్ ఎప్పటి లాగా తన పాత్రలో ఒదిగిపోగా, విష్ణుప్రియ సైతం కొంటెచూపులతో తెగ ఆకట్టుకుందనే చెప్పాలి. అయితే తాజాగా యాంకర్ విష్ణు ప్రియ ఇటీవల ఓ టీవీ షోలో సంచలన విషయాలు తెలిపింది. సుడిగాలి సుధీర్ తనను బాగా కేరింగ్ గా చూసుకుంటాడని, అలాగే తన తల్లి తర్వాత సుధీరే తన బాగోగుల గురించి పట్టించుకునే వాడని పేర్కొంది. సుధీర్ ను డాడీ అని పిలుస్తానని బాంబు పేల్చడంతో అభిమానులు తెగ హర్ట్ అయిపోతున్నారు. మరి ముందు ముందు వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.