సుడిగాలి సుధీర్ కు నిజంగా ఇది అవమానం అనే చెప్పాలి. జబర్దస్త్ లో లవర్ బాయ్ గా పేరున్న సుధీర్ అటు సినిమాల్లోనూ హీరోగా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటాడు. అలాంటి సుధీర్ కు చాపకింద నీరులా ఎదుగుతున్న మరో జబర్దస్త్ కమెడియన్ నుంచి పోటీ ఎదురవుతోంది. అతడు మరెవరో కాదు మాస్ అవినాశ్ ఉరఫ్ ముక్కు అవినాశ్, జబర్దస్త్ లో చాలా లో ప్రొఫైల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మాస్ అవినాశ్ నెమ్మదిగా, టాప్ పొజిషన్ చేరుకున్నాడు. టీమ్ లీడర్ గా కెవ్వు కార్తీక్ తో కలిసి స్కిట్స్ చేసే మాస్ అవినాశ్ స్కిట్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్పాంటేనియస్ గా పంచులు వేయడంతో పాటు సాయికుమార్ ను తలపించేలా మిమిక్రీ చేయడం అతడికి అదనపు అసెట్ అనే చెప్పాలి. ఇంతింతై వటుడింతై అన్నట్లు మాస్ అవినాష్ ఇప్పుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. తాజాగా శ్రీముఖితో కలిసి అతడు చేస్తున్న స్టార్ట్ మ్యూజిక్ రీలోడెడ్ ప్రోగ్రాంలో వీరిద్దరి కాంబినేషన్ జనాల్లో విపరీతమైన ఆదరణ పొందింది. అంతేకాదు శ్రీముఖి అల్లరి నిప్పు అయితే అందుకు పెట్రోల్ పోసినట్లు అవినాష్ రెచ్చిపోతున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ అనే చెప్పాలి. అటు రవితో గతంలో శ్రీముఖి పటాస్ చేసినప్పటికీ, అవినాష్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టుతోనే కాంబినేషన్ పండుతోందని అటు సోషల్ మీడియాలో శ్రీముఖి ఫ్యాన్స్ చెబుతున్నారు. తాజాగా క్యాష్ షోలో శ్రీముఖి, అవినాష్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. షో నిర్వాహకురాలు సుమ కూడా వీరి ఇద్దరి కాంబినేషన్ చూసిన ఆశ్చర్యపోయింది.
అయితే అవినాష్ ఈ తరహాలో రెచ్చిపోవడం చూస్తుంటే, మరో జబర్దస్త్ ఆర్టిస్టు సుడిగాలి సుధీర్ కాళ్ల కింద నీళ్లు వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సుధీర్ పారితోషికం కన్నా మాస్ అవినాష్ పారితోషికం కాస్త తక్కువే. పైగా అవినాష్ మల్టీ టాలెంటెడ్, ఎలాంటి సిట్యువేషన్ అయినా ఫన్ పుట్టించగలడు. దీంతో సుధీర్ కాస్త జాగ్రత్త పడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు సుధీర్ పక్కన పోవేపోరాలో యాంకర్ గా రాణిస్తున్న విష్ణుప్రియను అయితే అవినాష్ కనబడినప్పుడల్లా ఓ ఆట ఆడుకుంటున్నాడు. అందుకు తాజా క్యాష్ షోనే సాక్ష్యం అని చెప్పాలి. ఎనీ వే సుధీర్ ఆధిపత్యానికి అవినాష్ ఇంత త్వరగా చెక్ పెడతాడని ఎవరూ ఊహించలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.