సుడిగాలి సుధీర్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రష్మీ...ఎమోషనల్ అయిన సుధీర్

తాజాగా సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ లాంచ్‌కి స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానించారు. అయితే రష్మీ వస్తుందా...రాదా అనే సంశయం సుధీర్ లో ఉందని, అయితే రష్మీ రావడంతో సుధీర్ ఒక్క సారిగా ఎమోషనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది.

news18-telugu
Updated: December 3, 2019, 9:33 PM IST
సుడిగాలి సుధీర్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన యాంకర్ రష్మీ...ఎమోషనల్ అయిన సుధీర్
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ (Source: Youtube)
  • Share this:
టెలివిజన్ స్క్రీన్‌పై మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ ఎవరైనా ఉన్నారా అంటే అది మరో అనుమానం లేకుండా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌ అని చెప్పాలి. వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రష్మీ, సుధీర్ మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసి వాళ్లు ప్రేమించుకుంటున్నారని వార్తలు కూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఈ జంట కూడా వాటిని లైట్ తీసుకుంటారు. ఇదిలా ఉంటే తాజాగా సుడిగాలి సుధీర్ నటించిన సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా ట్రైలర్ లాంచ్‌కి స్పెషల్ గెస్ట్‌గా ఆహ్వానించారు. అయితే రష్మీ వస్తుందా...రాదా అనే సంశయం సుధీర్ లో ఉందని, అయితే రష్మీ రావడంతో సుధీర్ ఒక్క సారిగా ఎమోషనల్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే రష్మీతో పాటు ఢీ యూనిట్ మొత్తం సినిమా ట్రైలర్ లాంచ్ కి రాగా, రష్మీ మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పవచ్చు. ఇదిలా ఉంటే సుధీర్ ట్రైలర్ లాంచ్ కి రష్మీ గౌతం రాకపై అతడి ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారనే చెప్పవచ్చు.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>