హోమ్ /వార్తలు /సినిమా /

Gaalodu Trailer: యాక్షన్ మోడ్‌లో సుడిగాలి సుధీర్.. పవర్‌ఫుల్ సీన్స్

Gaalodu Trailer: యాక్షన్ మోడ్‌లో సుడిగాలి సుధీర్.. పవర్‌ఫుల్ సీన్స్

Gaalodu Trailer Photo News 18

Gaalodu Trailer Photo News 18

Sudigali Sudheer Gaalodu Trailer: చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్ప‌టికే విడుద‌లైన గాలోడు టీజ‌ర్, సాంగ్స్‌కి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

జబర్దస్త్ వేదికగా ఫేమస్ అయిన కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా రాణిస్తున్నారు. తమలోకి టాలెంట్ వెలికితీస్తూ అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు. ఇదే బాటలో ఇప్పటికే చాలామంది కమెడియన్స్ వెండితెరపై సక్సెస్ అయ్యారు. అందులో సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) ఒకరు. హీరోగా పలు సినిమాలు చేస్తున్న ఈ జబర్దస్త్ కమెడియన్ ఇప్పుడు గాలోడు (Gaalodu)గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప‌క్కా మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి విశేష ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ట్రైలర్ (Gaalodu Trailer) రిలీజ్ చేశారు మేకర్స్. దాదాపు రెండున్న‌ర నిమిషాల నిడివిగ‌ల ఈ ట్రైలర్‌తో సినిమా ఎలా ఉండ‌బోతుందో ముందే హింట్ ఇచ్చారు మేక‌ర్స్. సుధీర్ మాస్‌లుక్‌లో చేసే యాక్ష‌న్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఒక‌వైపు మాస్ లుక్‌లో ఆక‌ట్టుకుంటూనే మ‌రోవైపు స్టైలీష్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశారు సుధీర్. ఇక ``వ‌య‌సు త‌క్కువ `షో`లు ఎక్కువ‌, నువ్వు శ‌నివారం పుట్టావా? శ‌నిలా త‌గులుకున్నావ్‌, రామాయ‌ణంలో ఒక్కటే మాయ లేడీ ఇక్క‌డ అంద‌రు మాయ లేడీలే..వంటి డైలాగ్స్‌లో ఎంట‌ర్‌టైన్ చేస్తూనే `వాడిది మామూలు రేంజ్ కాదు మాఫియా రేంజ్, సైనైడ్, యాసిడ్ కంటే డేంజ‌ర్‌రా వాడు, రాక్ష‌సుల గురించి పుస్త‌కాల్లో చ‌దివాను, విన్నాను మొట్ట‌ మొద‌టిసారి వీడిలో చూశాను సార్` వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై అంచానాల్ని రెట్టింపు చేశాయి.

గెహ్నాసిప్పి గ్లామ‌ర్‌, స‌ప్త‌గిరి కామెడీ టైమింగ్ ట్రైల‌ర్‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ సి. రాంప్ర‌సాద్ విజువ‌ల్స్, టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ భీమ్స్ పాట‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్ లెవ‌ల్‌లో ఉన్నాయి. సుధీర్ సరసన గెహ్నా సిప్పి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. టైటిల్ అనౌన్స్ చేసిన‌ప్ప‌టినుండే ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి.' isDesktop="true" id="1491796" youtubeid="ccrFR8ANpU0" category="movies">

సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సి రాం ప్ర‌సాద్‌ సినిమాటోగ్ర‌ఫి అందించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా `గాలోడు` సినిమాను న‌వంబ‌రు 18న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

First published:

Tags: Sudigali sudheer, Tollywood, Tollywood actor

ఉత్తమ కథలు