హోమ్ /వార్తలు /సినిమా /

Gaalodu Movie Review: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రివ్యూ.. ఈ గాలోడి హవా ఎలా ఉందంటే..!

Gaalodu (గాలోడు)
Gaalodu (గాలోడు)
2.5/5
రిలీజ్ తేదీ:18/11/2022
దర్శకుడు :  రాజశేఖర్ రెడ్డి పులిచర్ల
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
నటీనటులు : సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, షకలక శంకర్, సత్యకృష్ణ తదితరులు..
సినిమా శైలి : కామెడీ యాక్షన్ (Comedy Action)

Gaalodu Movie Review: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ మూవీ రివ్యూ.. ఈ గాలోడి హవా ఎలా ఉందంటే..!

‘గాలోడు’ మూవీ రివ్యూ (Twitter/Photo)

‘గాలోడు’ మూవీ రివ్యూ (Twitter/Photo)

Gaalodu Movie Review: స్మాల్ స్క్రీన్ పై స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించిన సుధీర్.. ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాలోడుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రోజు (నవంబర్ 18) ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమాతో హీరోగా సుడిగాలి సుధీర్ సుడి తిరిగిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : గాలోడు (Gaalodu)

నటీనటులు :సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, షకలక శంకర్, సత్యకృష్ణ తదితరులు..

ఎడిటర్: ఎంఎస్ఆర్

సినిమాటోగ్రఫీ: అనీష్, వెంకట్ దీప్,

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నిర్మాత : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి పులిచర్ల

విడుదల తేది : 18/11/2022

స్మాల్ స్క్రీన్ పై ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో ఎంతో మంది నటులకు జీవితాన్ని ఇచ్చింది. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. తనదైన స్కిట్స్‌తో స్మాల్ స్క్రీన్ పై  స్టార్ కమెడియన్‌గా ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్నాడ సుధీర్.. ఇప్పుడు హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గాలోడుగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ రోజు (నవంబర్ 18) ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజైంది. మరి ఈ సినిమాతో హీరోగా సుడిగాలి సుధీర్ సుడి తిరిగిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

‘గాలోడు’ (సుడిగాలి సుధీర్) అనే టైటిల్‌తోనే హీరో ఎలాంటి వాడనేది దర్శకుడు జస్టిఫికేషన్ ఇచ్చేసాడు. పని పాట లేకుండా.. జీవితంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా తిరిగే సుడిగాలి సుధీర్.. తన ఊర్లో సర్పంచ్ కొడుకు అనుకోకుండా ఇతని చేతిలో చనిపోతాడు. దీంతో భయంతో ఉన్న ఊరు ఒదిలి పారిపోయి హైదరాబాద్ వస్తాడు. అక్కడ అనుకోకుకండా కథానాయిక గెహెనా సిప్పి పరిచయమవుతోంది. అది కాస్త ప్రేమగా మారుతోంది. వీరి ప్రేమకు హీరోయిన్ తండ్రి అడ్డు పడతాడు. మరి గాలోడు హీరోయిన్  తండ్రి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడా ? ఇక ఊర్లో జరిగిన మర్దర్ కేసు విషయంలో సుడిగాలి సుధీర్ ఎలాంటి చిక్కులు ఎదుర్కొన్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల ఈ సినిమాకు గాలోడు అనే టైటిల్‌తోనే హీరో క్యారెక్టర్.. అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పేసాడు. సుడిగాలి సుధీర్ వంటి జబర్ధస్త్ నటుడితో సినిమా తీయడానికి కథ అవసరం లేదునుకున్నాడో ఏమో.. పరమ రొటిన్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించాడు. రెగ్యలర్ స్టోరీనే తీసుకున్న దాన్ని అద్భుతమైన స్క్రీన్ ప్లే, సన్నివేశాలతో తెరకెక్కించలేకపోయాడు. సుధీర్ పాత్ర డిజైన్ వరకు బాగానే మిగతా పాత్రను గాలోడు టైటిల్ తరహాలోనే గాలి ఒదిలేసినట్టు కనపడుతోంది. టెక్నాలజీ పుణ్యామా.. ఎక్కడో ఏదో నేరం చేసినవాళ్లను పోలీసులు ఈజీగా పట్టేసుకుంటున్నారు. అలాంటిది ఊర్లో.. అది కూడా దొంగతనం గట్రా కాకుండా ఏకండా ఓ వ్యక్తిని చంపేసినవాడిని పోలీసులు అంత ఈజీగా పట్టుకోకుండా  ఒదిలిపెడతారా అనే డౌట్స్ వస్తాయి. కేవలం సుధీర్‌ ఉన్నాడు కాబట్టి.. ఆల్రెడీ జబర్ధస్త్‌లో ఈయన చేసే యాక్టింగ్, డాన్స్ నమ్ముకొని స్లో నేరేషన్‌తో ఎక్కడా లాజిక్‌ లేకుండా తెరకెక్కించాడు. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఎందుకు వస్తున్నాయో అర్ధం కాదు.  ఓవరాల్‌గా మాత్రం హీరోగా సుధీర్‌ను చాలా చక్కగా చూపించగలిగాడు. బీ,సీ సెంటర్స్ ఆడియన్స్‌కు ఈ తరహా సినిమాలు నచ్చుతాయా.. ? వాళ్లు కూడా కొత్తదనం కోరుకుంటారా అనేది చూడాలి. సినిమాకు భీమ్స్ అందించిన సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్‌‌కు తన కత్తెరకు బాగానే పదును పెట్టాల్సి ఉన్నఎందుకో మరిచిపోయినట్టు కనిపిస్తోంది.

నటీనటులు విషయానికొస్తే..

జబర్ధస్త్‌ కామెడీ షోతో తన టాలెంట్ ఏంటో ఇప్పటికే ప్రేక్షకులకు తెలుసు. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్..నటన, డాన్సులతో పాటు ఫైట్స్‌లో  ఇరగదీసాడు. కామెడీ టైమింగ్‌ చెప్పాల్సిన పనిలేదు. సాదాసీదా  కథను తనదైన నటనతో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ సాధించాడు. మాస్ నచ్చేలా గాలోడు తరహా పాత్రలో చక్కగా ఇమిడిపోయాడు. మొత్తంగా సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసాడు.  హీరోయిన్ గెహ్నా సిప్పి ఉన్నంతలో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చిత్రణ కూడా పర్వాలేదు. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కుదిరింది. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు పర్వాలేదనిపించారు.

ప్లస్ పాయింట్స్ 

సుడిగాలి సుధీర్ నటన

సుధీర్ డాన్స్ మూమెంట్స్

కామెడీ

మైనస్ పాయింట్స్ 

రొటిన్ కథ

స్క్రీన్ ప్లే

ఎడిటింగ్

చివరి మాట : సుడిగాలి సుధీర్ వన్ మ్యాన్ షో

రేటింగ్ : 2.5/5

First published:

రేటింగ్

కథ:
2.5/5
స్క్రీన్ ప్లే:
2.5/5
దర్శకత్వం:
2.5/5
సంగీతం:
2.5/5

Tags: Gaalodu, Sudigali sudheer, Tollywood

ఉత్తమ కథలు