సారీ చెప్పిన సుడిగాలి సుధీర్.. ఇకపై అంటు చెంపలు వాయించుకున్న కమెడియన్.. వివరాల్లోకి వెళితే.. తనదైన స్టైల్ కామెడీతో, టైమింగ్‌తో స్మాల్ స్క్రీన్స్‌పై సుడిగాలి సుధీర్ మంచి ఫాలోయింగే సంపాదించుకున్నాడు. ఇప్పుడు టీవీలో టాప్ రేటెడ్ ఆర్టిస్ట్‌గా సుడిగాలి సుధీర్ చెలరేగిపోతున్నాడు. యూట్యూబ్‌లో కూడా అతడి వీడియోస్‌కి పెట్టిన కొన్ని గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వస్తాయి.యాక్టింగ్, కామెడీ, డ్యాన్స్, మ్యూజిక్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడీ యంగ్ స్టార్.అయితే తనకు పేరు తీసుకొచ్చిన కామెడీని పక్కనబెట్టి హీరోగా అన్ని ఎమోషన్స్ పండిద్దామని ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’ అనే సినిమాతో హీరోగా అవతారమెత్తాడు.ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.సినిమాలో దమ్ము లేకపోవడం పక్కనబెడితే చాలా బోరింగ్‌గా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించలేదు. అయితే తన కెరీర్ తొలినాళ్లలో నెలకు రూ.8వేల జీతంతో మొదలెట్టి ఆతర్వాత అనేక కష్టాలతో తన జీవితాన్ని విజయం వైపు తిప్పుకున్న సుడిగాలి సుధీర్ కు ఈ సినిమా ప్లాప్ ఒక గుణపాఠం లాంటిదే అంటున్నారు అతని ఫాన్స్.
మల్టీ టాలెంటెడ్ అయిన సుధీర్ కథను సరిగా ఎంచుకోలేకపోవడమే ఈ సినిమా బోల్తా పడటానికి కారణంగా చెప్పుకుంటున్నారు. తన కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూసిన సుధీర్ త్వరలోనే మంచి సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడంటూ నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు అభిమానులు. దీంతో సుడిగాలి.. చెంపలు వాయించుకుంటూ.. ఇకపై సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉంటానంటూ ఫ్యాన్స్‌కు సారీ చెప్పాడట. ప్రస్తుతం సుధీర్ సంక్రాంతిని పురస్కరించుకుని ‘అమ్మా నాన్న ఓ సంక్రాంతి' అనే స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నారు. దీనికి రోజా, సుధీర్, అనసూయ సహా ఎంతో మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.