హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: హీరో నవదీప్ ఇష్యూలో సుడిగాలి సుధీర్ సీరియస్...అంతసీన్ లేదంటూ...షో మధ్యలోనే..

Sudigali Sudheer: హీరో నవదీప్ ఇష్యూలో సుడిగాలి సుధీర్ సీరియస్...అంతసీన్ లేదంటూ...షో మధ్యలోనే..

నవదీప్, సుడిగాలి సుధీర్

నవదీప్, సుడిగాలి సుధీర్

సుధీర్ హెలో మనరేంజ్ ఏంటో తెలుసా అని గుర్తు చేశాడు. అయితే నవదీప్ కూడా ఏమాత్రం తగ్గకుండా సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు అంటూ చాలెంజ్ విసిరాడు.

సుడిగాలి సుధీర్ అంటే అతడి ఫ్యాన్స్ కు విపరీతమైన ఆరాధనా భావం ఏర్పడిపోయింది. ఇప్పటికే సుధీర్ కు ఫ్యాన్స్ తమ గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. బుల్లితెర పవర్ స్టార్ గా పేరొందిన సుడిగాలి సుధీర్ ‌కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇన్ని రోజులు ఓ కమెడియన్ గా నవ్వులు పూయించిన సుధీర్ ప్రస్తుతం సినిమా రంగంలోనూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన సుధీర్...మరో నాలుగు సినిమాలను సైన్ చేసేశాడు. ఇక మానవత్వం విషయంలో సుధీర్ ను మించిన వారు లేరని అతడి ఫ్యాన్స్ చెబుతుంటారు. చిన్న ఆర్టిస్టుల పాలిట సుధీర్ దేవుడని, అతడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ ఎప్పుడూ సుధీర్ వెనుక నిలుస్తుంటారు. ఇప్పటికే సుధీర్ కు డెడికేట్ చేస్తూ ఢీ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో సుడిగాలి సుధీర్ విశ్వరూపం చూపించారు. అతడి లైఫ్ మొత్తం చూపించారు.

ఓ యాంకర్ గురించి ఢీ షోలో ఓ సాంగ్ మొత్తం డెడికేట్ చేసి అలా ప్రెజెంట్ చేయడం ఇదే తొలిసారి. దీని వెనుక సుధీర్ కష్టం కనిపిస్తుంది. సుడిగాలి సుధీర్ బుల్లితెరపై వరకూ అతడి ప్రయాణం చాలా కష్టాలతో కూడినది. దీంతోనే సుధీర్ అంటే ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇదే అతడి వెనుక బలంగా మారింది. ఇక సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక గ్రూపుగా ఏర్పడి, అతడిని అనుక్షణం ఫాలో అవుతున్నారు.

అయితే తాజాగా సుధీర్ ను చులకన చేస్తూన్నవారిపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఈవెంట్ షోలో పొరపాటున సుధీర్ ను ఎవడ్రా నువ్వు అన్నందుకు...నెటిజన్లు అతడిని వెంటాడారు. దీంతో రాహుల్ ఏకంగా సారీ చెప్పడంతో పాటు అందంతా ఈవెంట్ లో భాగమని చెప్పుకొచ్చాడు. సుధీరే స్వయంగా వీడియో పెట్టి...తన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేశాడు. ఇక తాజాగా ఢీ షోలో అయితే శేఖర్ మాస్టర్ స్థానంలో జడ్జిగా వస్తున్న బాబా భాస్కర్ అయితే తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి సుధీర్ ను కార్నర్ చేస్తూ వేస్ట్ రా నువ్వు..వేస్ట్ అంటూ టైం పాస్ చేస్తున్నాడని సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.

ఇప్పుడు హీరో నవదీప్ వంతు వచ్చింది. ఎప్పుడో పుష్కర కాలం క్రితం సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం టీవీ యాంకర్ గానూ, సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగానూ దర్శనమిస్తున్నాడు. అయితే నవదీప్ తాజాగా ఈటీవీలో దసరా స్పెషల్ ఈవెంట్ అక్కా ఎవరే అతగాడు..లో పాల్గొన్నాడు. ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ ప్రోమోలో ఫైనల్ టచ్ గా సుడిగాలి సుధీర్ తో నవదీప్ పంచ్ వేస్తూ, స్టేడియంలో ఎవరైనా సిక్సర్ కొడతారు. కానీ స్టేడియంలో కొట్టేవాడికే ఓ రేంజ్ ఉంటుంది. అంటూ సాహో సినిమాలో డైలాగ్ ను అప్పచెప్పాడు. పక్కనే ఉన్న సుధీర్ హెలో మనరేంజ్ ఏంటో తెలుసా అని గుర్తు చేశాడు. అయితే నవదీప్ కూడా ఏమాత్రం తగ్గకుండా సోది ఆపు దమ్ముంటే నన్ను ఆపు అంటూ చాలెంజ్ విసిరాడు. అయితే ఇదంతా స్పోర్టివ్ గానే గడిచిపోయింది. సుధీర్ కూడా కాస్త షాక్ కు గురయ్యాడనే అంటున్నారు. కానీ వెంటనే తేరుకొని నవదీప్ కు పంచ్ వేశాడని సన్నిహితులు అంటున్నారు. ఇలా గతంలో బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్ లకు ఎదురైన అనుభవమే అటు నవదీప్ కు కూడా ఎదురైంది. అంతేకాదు సుడిగాలి సుధీర్ ఫ్యాన్స్ ఈ సారి నవదీప్ ను టార్గెట్ చేశారు. వడ్డించిన విస్తరి తరహాలో తొలి సినిమాతోనే హీరోగా పరిచయమైన నవదీప్ ప్రస్తుతం ఓ కామెడీ షో జడ్జి స్థాయిలో ఉన్నాడని, అదే సుడిగాలి సుధీర్ ఓ చిన్న కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరో స్థాయికి ఎదిగాడని సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు సుధీర్ స్థాయిని గుర్తించేందుకు నవదీప్ మనస్సు ఒప్పుకోవడం లేదని విమర్శించారు. బాలివుడ్ లో ఉన్న నెపోటిజం ప్రస్తుతం టాలివుడ్ లో కూడా టాలెంట్ ఉన్న ఆర్టిస్టుల పట్ల శాపంగా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. అయితే గతంలో రాహుల్ సిప్లిగంజ్ కూడా సుధీర్ పై పొరపాటును నోరుజారినందుకు అతడు సారీ చెప్పేదాకా సుడిగాలి ఫ్యాన్స్ ట్రోల్స్ ఆపలేదు. ఇప్పుడు నవదీప్ విషయంలో కూడా అదే జరిగినా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదని సినీపండితులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Jabardasth comedy show, Sudigali sudheer