హోమ్ /వార్తలు /సినిమా /

బాబా భాస్కర్‌‌కు దిమ్మతిరిగే వార్నింగ్..Sudigali Sudheer విషయంలో లిమిట్ క్రాస్ చేస్తే...ఊరుకోమంటూ..

బాబా భాస్కర్‌‌కు దిమ్మతిరిగే వార్నింగ్..Sudigali Sudheer విషయంలో లిమిట్ క్రాస్ చేస్తే...ఊరుకోమంటూ..

సుడిగాలి సుధీర్ (sudigali sudheer)

సుడిగాలి సుధీర్ (sudigali sudheer)

బాబా భాస్కర్ తన లిమిట్స్ లో ఉంటే మంచిదని, ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే బాగుండదని సుధీర్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. బాబా భాస్కర్ తన పద్ధతి మార్చుకోవాలని, శేఖర్ మాస్టర్ ను చూసి హుందాతనం నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

సుడిగాలి సుధీర్ అంటే అతడి ఫ్యాన్స్ కు విపరీతమైన ఆరాధనా భావం ఏర్పడిపోయింది. ఇప్పటికే సుధీర్ కు ఫ్యాన్స్ తమ గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. బుల్లితెర పవర్ స్టార్ గా పేరొందిన సుడిగాలి సుధీర్ ‌కు ఫ్యాన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇన్ని రోజులు ఓ కమెడియన్ గా నవ్వులు పూయించిన సుధీర్ ప్రస్తుతం సినిమా రంగంలోనూ దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు సినిమాల్లో నటించిన సుధీర్...మరో నాలుగు సినిమాలను సైన్ చేసేశాడు. ఇక మానవత్వం విషయంలో సుధీర్ ను మించిన వారు లేరని అతడి ఫ్యాన్స్ చెబుతుంటారు. చిన్న ఆర్టిస్టుల పాలిట సుధీర్ దేవుడని, అతడు ఎంతో మందికి లైఫ్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ ఎప్పుడూ సుధీర్ వెనుక నిలుస్తుంటారు. ఇప్పటికే సుధీర్ కు డెడికేట్ చేస్తూ ఢీ కూడా ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సాంగ్ లో సుడిగాలి సుధీర్ విశ్వరూపం చూపించారు. అతడి లైఫ్ మొత్తం చూపించారు.

ఓ యాంకర్ గురించి ఢీ షోలో ఓ సాంగ్ మొత్తం డెడికేట్ చేసి అలా ప్రెజెంట్ చేయడం ఇదే తొలిసారి. దీని వెనుక సుధీర్ కష్టం కనిపిస్తుంది. సుడిగాలి సుధీర్ బుల్లితెరపై వరకూ అతడి ప్రయాణం చాలా కష్టాలతో కూడినది. దీంతోనే సుధీర్ అంటే ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఇదే అతడి వెనుక బలంగా మారింది. బుల్లితెరపై మొదలైన అతడి ప్రస్థానం వెండితెరకు సాగింది. సుధీర్ విజయం వెనుక రష్మీ కూడా ఓ కారణం అనే చెప్పాలి. రష్మీ కూడా వెన్నంటి అతడిని ప్రోత్సహించింది. ఇదే సుధీర్ విజయానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. ఇక సుధీర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక గ్రూపుగా ఏర్పడి, అతడిని అనుక్షణం ఫాలో అవుతున్నారు.

అయితే తాజాగా సుధీర్ ను చులకన చేస్తూన్నవారిపై ట్రోలింగ్ కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఓ ఈవెంట్ షోలో పొరపాటున సుధీర్ ను ఎవడ్రా నువ్వు అన్నందుకు...నెటిజన్లు అతడిని వెంటాడారు. దీంతో రాహుల్ ఏకంగా సారీ చెప్పడంతో పాటు అందంతా ఈవెంట్ లో భాగమని చెప్పుకొచ్చాడు. సుధీరే స్వయంగా వీడియో పెట్టి...తన ఫ్యాన్స్ ను కంట్రోల్ చేశాడు. ఇక తాజాగా ఢీ షోలో అయితే శేఖర్ మాస్టర్ స్థానంలో జడ్జిగా వస్తున్న బాబా భాస్కర్ అయితే తన బలహీనతలను కప్పిపుచ్చుకోవడానికి సుధీర్ ను కార్నర్ చేస్తూ వేస్ట్ రా నువ్వు..వేస్ట్ అంటూ టైం పాస్ చేస్తున్నాడని సుధీర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాబా భాస్కర్ తన లిమిట్స్ లో ఉంటే మంచిదని, ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తే బాగుండదని సుధీర్ ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు. బాబా భాస్కర్ తన పద్ధతి మార్చుకోవాలని, శేఖర్ మాస్టర్ ను చూసి హుందాతనం నేర్చుకోవాలని సూచిస్తున్నారు. అటు సుడిగాలి సుధీర్ మాత్రం బాబా భాస్కర్ పై అనవసరంగా ద్వేషం పెంచుకోవద్దని, ఆయన ఓ సీనియర్ డాన్స్ మాస్టర్ అని వెనకేసుకొచ్చాడు. తన కోసం బాబా భాస్కర్ ను క్షమించాలని సుధీర్ తన ఫ్యాన్్స్ ను కోరనున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Baba Bhaskar, Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer

ఉత్తమ కథలు