సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. సుడిగాలి సుధీర్ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమ్మయిల్లో కూడా అతనికి భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 'ఈటీవీ'లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షోలో తన కామెడీ టైమింగ్‌తో అదిరిపోయే పంచులేస్తుంటాడు సుధీర్. ఓ పక్క 'జబర్దస్త్' షోలో కామెడీ పండిస్తూనే.. మరో వైపు 'ఢీ' డాన్స్ షోలో యాంకరింగ్, టీమ్ లీడర్‌గా రాణిస్తున్నాడు. తాజాగా సుధీర్ వెండితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇక జబర్దస్త్ షోలో రష్మీని ఏడిపిస్తూ... సుడిగాలి సుధీర్ వేసిన పంచ్‌లకు రేక్షుకలతో పాటు... నాగబాబు రోజా సైతం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఎక్సట్రా జబర్దస్త్ ప్రొమోలో మరోసారి సుడిగాలి సుధీర్ రష్మీని ఉద్దేశిస్తూ పండించిన కామెడీ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ప్రొమో కూడా ట్రెండింగ్‌లో నడుస్తుంది.
సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అవుతోంది. అటు సుధీర్ చేసిన కామెడీని రష్మీకూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుధీర్, రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కలిసి చేసిన స్కిట్‌లో .. సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారాయి. మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అంటూ రామ్ ప్రసాద్ వేసిన ప్రశ్నకు సుధీర్.. ఏడేళ్లుగా ఓ అమ్మాయిని ట్రే చేస్తున్నా అయిన పడటం లేదంటూ... రష్మీ వైపు కొంటెగా చూస్తూ సుధీర్ చెబుతున్నట్లు మనకు ప్రొమోలో కనిపిస్తుంది. దీనికి రష్మీ కూడా నవ్వుతూ కనిపించింది. మొత్తానికి సుడిగాలి సుధీర్ స్కిట్ అంటేనే జబర్దస్త్ ప్రొగ్రామ్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇక అందులో రష్మీపై డైలాగులు వేస్తే... ఇక వాటికి రెస్పాన్స్ మామూలుగా ఉండదు. మరి నవంబర్ 15న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. మరి ఫుల్ ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ టీం.. రష్మీపై ఇంకా ఎన్ని పంచ్‌లు వేస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Jabardasth comedy show, Rashmi Gautam, Sudigali sudheer, Sudigali Sudhir