Home /News /movies /

SUDIGALI SUDHEER DUPE BALU IN JABARDASTH SKITS SK

జబర్దస్త్‌లో సుధీర్ డూప్ సందడి.. అచ్చం అలాగే ఉన్నాడుగా..

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

తన బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ అంటూ చెప్పుకొచ్చాడు. సరిగమపలో ఈ ఇద్దరూ చేసిన కామెడీ కూడా హైలైట్ అయింది. ఇప్పటికే ఢీ షోలో ప్రదీప్, సుధీర్ కాంబో బ్లాక్‌బస్టర్ అయింది.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ స్కిట్‌లో కొత్త వ్యక్తి కనిపించాడు. అతడెవరో కాదు..సుధీర్ డూప్..! పేరు రవి చీరాల. టిక్‌ టాక్‌లో ఇతడు సుధీర్ డైలాగ్‌లు, హావభావాలతో దుమ్మురేపుతున్నాడు.

    తెలుగింట బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ మరే షోకు లేదేమో..! ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఖతర్నాక్ కామెడీ షో..! జబర్దస్త్‌కు ఎంతో మంది కొత్త నటులు వస్తుంటారు. కొందరు వెళ్లిపోతుంటారు. ఇక అప్పుడప్పుడూ స్పెషల్ గెస్ట్‌లు కూడా వస్తుంటారు. సినిమా ఇండస్ట్రీ, సోషల్ మీడియాకు చెందిన అతిథులు జబర్దస్త్ స్టేజిపై సందడి చేస్తుంటారు. ఐతే శుక్రవారం ప్రసారమైన ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ స్కిట్‌లో కొత్త వ్యక్తి కనిపించాడు. అతడెవరో కాదు..సుధీర్ డూప్..! పేరు రవి చీరాల.  టిక్‌ టాక్‌లో ఇతడు సుధీర్ డైలాగ్‌లు, హావభావాలతో దుమ్మురేపుతున్నాడు.

    సుడిగాలి సుధీర్ డూప్


    స్కిట్‌లో సుధీర్ రైలులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో గెటప్ శ్రీను ఓ ఫొటోతో వచ్చి సుధీర్‌ని కత్తితో బెదిరిస్తాడు. మా చెల్లిని మోసం చేసి రైల్లో పారిపోతున్నావా..? అంటూ మండిపడతాడు. నేను మీ చెల్లిని మోసం చేయడం ఏంటి సార్..? అసలు మీరెవరు? అంటూ అమాయంగా అడుగుతాడు సుధీర్. అప్పుడు శ్రీను ఆ ఫొటో తీసి.. ఇందులో ఉన్నది నువ్వే కదా అని అడగ్గా.. అది నేను కాదు సార్ అని సుధీర్ చెబుతాడు. అతడు తన డూప్ అని..ఈ మధ్యే తయారయ్యాడని అని క్లారిటీ ఇస్తాడు. నీ కంటే వీడే బాగున్నాడంటూ సుధీర్‌పై సెటైర్ వేస్తాడు శ్రీను.  దాంతో సుధీర్ డూప్ ఎవరని తెగ వెతుకుతున్నారు జబర్దస్త్ వ్యూయర్స్. బాలు టిక్‌టాక్‌లో సుధీర్‌లా నటిస్తాడని తెలియడంతో.. అచ్చం అలాగే ఉన్నాడుగా.. అని ఆశ్చర్యపోతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jabardasth, Jabardasth comey show, Sudigali sudheer, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు