సుడిగాలి సుధీర్ రైల్వేస్టేషన్‌లో పల్లీలు అమ్మేవాడంట..

సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఎంతంటే సుడిగాలి సుధీర్ తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

news18-telugu
Updated: November 5, 2019, 12:48 PM IST
సుడిగాలి సుధీర్ రైల్వేస్టేషన్‌లో పల్లీలు అమ్మేవాడంట..
Instagram/sudheeranandbayana
  • Share this:
సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఎంతంటే సుడిగాలి సుధీర్ తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 'ఈటీవీ'లో ప్రసారం అయ్యే ఈ షోలో ఓ టీమ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తూ.. తన అల్లరి, కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నాడు సుధీర్. ఆయన ఓ పక్క  'జబర్దస్త్' షోలో కామెడీ పండిస్తూనే.. మరో వైపు 'ఢీ' డాన్స్ షోలో యాంకరింగ్‌, టీమ్ లీడర్‌గా రాణిస్తున్నాడు. కాగ తాజాగా ఈ షో ప్రోమో యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ తాజా ప్రోమోలో అదిరిపోయే డాన్స్‌లతో పాటు.. యాంకర్ రవి, వర్షిణిలు తమదైన శైలిలో అలరిస్తూ అదరగొట్టారు. వీరికి తోడుగా పాపులర్ యాంకర్స్ అండ్ టీమ్ లీడర్స్‌‌గా వ్యవహరిస్తున్న రష్మీ, సుధీర్‌లు తోడైయ్యారు. దీంతో మరింత సందడిగా మారింది. విడుదలైన ప్రోమోలో యాంకర్ రవి మాట్లాడుతూ.. రష్మీని, సుధీర్‌ను ఆదిమానవులతో పోల్చాడు. ఈ సందర్భంగా జరిగిన సంభాషణలో సుధీర్ మాట్లాడుతూ.. మా కంటే ముందు మీరెందుకు వచ్చారని.. ప్రశ్నించగా.. రవి రెస్పాండ్ అవుతూ.. నువ్వేమన్నా...రైల్వే స్టేషన్‌లో పనిచేసేవాడివా.. ఏ ట్రైన్ ఎప్పుడూ రావాలో చెప్పడానికి అంటూ కౌంటర్ ఇచ్చాడు. దీనికి స్పందించిన సుధీర్.. పల్లీలు, పల్లీలే అంటూ అమ్మే వాడిలా కనపడుతున్నాన.. అంటూ అందరి నోట నవ్వులు పూయించాడు. దీనికి రష్మీ స్పందిస్తూ.. నువ్వు చేసేది అదేగా అంటూ అదిరిపోయె కౌంటర్ ఇచ్చింది. 

View this post on Instagram
 

Designed by : @divya_varun_offical Styling by : @v_varun_rao Photography by : @v_capturesphotography


A post shared by Sudigali Sudheer Official (@sudheeranandbayana) on

ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా సుధీర్ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'త్రీమంకీస్'. ఈ సినిమాలో సుధీర్‌తో పాటు రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను కూడా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి టాక్‌ను తెచ్చుకుంది.


అందాల వదినమ్మ అదిరిపోయే పిక్స్..

First published: November 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>