హోమ్ /వార్తలు /సినిమా /

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర నిజాలు వెల్లడించిన సుడిగాలి సుధీర్..

తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర నిజాలు వెల్లడించిన సుడిగాలి సుధీర్..

సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఎంతంటే సుడిగాలి సుధీర్ తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.

    సుడిగాలి సుధీర్ 'జబర్దస్త్ షో' ద్వారా ఎంతో పాపులర్ అయ్యాడు. ఎంతంటే సుడిగాలి సుధీర్ తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. 'ఈటీవీ'లో ప్రసారం అయ్యే ఈ షోలో ఓ టీమ్‌కు లీడర్‌గా వ్యవహరిస్తూ.. తన అల్లరి, కామెడీ టైమింగ్‌తో అదరగొడుతున్నాడు సుధీర్. ఆయన ఓ పక్క  'జబర్దస్త్' షోలో కామెడీ పండిస్తూనే.. మరో వైపు 'ఢీ' డాన్స్ షోలో యాంకరింగ్‌, టీమ్ లీడర్‌గా రాణిస్తున్నాడు. సుధీర్ తాజాగా ఈటీవీలో ప్రసారం అయ్యే ఆలీతో సరదాగాలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన పలు సంఘటల్నీ పంచుకున్నాడు. యాంకర్ ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు సమాదానంగా సుధీర్ తన చిన్నతనంలో జరిగిన క్యూట్ లవ్ స్టోరీ గురించి ఈ సందర్భంగా వెల్లడించాడు. ఐదో తరగతిలో ఉండగానే ఓ అమ్మాయికి లైన్‌ వేశావట అని యాంకర్ ఆలీ ప్రశ్నించగా సుడిగాలి సుధీర్‌ స్పందిస్తూ.. చిన్నప్పుడు ఎవరైనా అమ్మాయితో మాట్లాడితే ఊరికే లింకులు పెడతారు కదా! అందులో భాగంగానే నేను ఓ అమ్మాయితో మాట్లాడటం మొదలు పెట్టాను. ఇక అప్పటి నుండి మా ఫ్రెండ్స్‌ ఏదో ఒకటి ప్రేమ దోమ అనేవారు. అయితే కొన్నిరోజులకు ఆ అమ్మాయిని తాను కూడా ఇష్టపడ్డట్లు తెలిపాడు. ఆ లవ్ స్టోరి నాలుగు సంవత్సరాల పాటు నడించదని తెలిపాడు. తాను 5వ తరగతిలో ఓ అమ్మాయిను ఇష్టపడితే, 9వ తరగతిలో ఆ అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుందని తెలిపాడు. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఈ విషయం సుధీర్ ప్రేమించిన అమ్మాయి వాళ్లింట్లో తెలవడంతో గొడవలు అయ్యాయని తెలిపాడు. ఇక ఆ దెబ్బతో స్కూల్లో అప్పటినుండి అబ్బాయిల్ని, అమ్మాయిల్నీ విడివిడిగా వేర్వేరు తరగతుల్లో కూర్చోబెట్టేవారని అన్నాడు. అయితే ఎప్పుడైతే తన పదో తరగతి పూర్తైందో అప్పడు మళ్లి అందర్నీ ఒకే క్లాస్‌లో కూర్చోబెట్టారని తన చిన్ననాటి సంగతుల్నీ పంచుకున్నాడు సుధీర్.

    సాటిలేని ఇలియానా నడుమందాలు..

    First published:

    Tags: Sudigali sudheer, Telugu Cinema News

    ఉత్తమ కథలు