Sudigali Sudheer - Actress Hema: బుల్లితెర స్టార్ కమెడియన్ గా నిలిచిన సుడిగాలి సుధీర్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరలో సుధీర్ ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. ఇక ఈయనకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఓ స్టార్ హీరోకి ఉన్నంత ఉందనే చెప్పాలి. అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంటాడు. కొన్ని కొన్ని సార్లు బాగా ట్రోలింగ్స్ ఎదుర్కొంటాడు. ఇదిలా ఉంటే తాజాగా నటి హేమపై షాకింగ్ కామెంట్స్ చేశాడు సుధీర్.
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోతో కమెడియన్ గా పరిచయమైన సుధీర్.. స్టార్ కమెడియన్ గా నిలిచాడు. ఇక ఈ షోతో పాటు పలు షోలలో కూడా బాగా బిజీగా ఉన్నాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా చేస్తున్నాడు. అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఎంటర్టైన్మెంట్ షోలో కూడా యాంకర్ గా చేస్తున్నాడు సుధీర్.ఇక తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ కి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఇందులో ప్రతి వారం స్పెషల్ గెస్ట్ గా సెలబ్రెటీలను ఆహ్వానిస్తుంటారు. ఇక తాజాగా ఇందులో కొందరు సెలబ్రెటీలు పాల్గొనగా.. సినీ నటి హేమ కూడా పాల్గొన్నది. ఇక సుధీర్, హేమ మధ్య కాసేపు సరదాగా గడిచింది. అంతేకాకుండా గేమ్ లో భాగంగా కిట్టీ పార్టీ అని సుడిగాలి సుధీర్ ముగ్గురు అమ్మాయిలను తీసుకొచ్చాడు.దీంతో హేమ వీళ్ళని ఎందుకు తీసుకువచ్చారు అని ప్రశ్నించగా.. పార్టీ కదా అందుకే తీసుకొచ్చాను అంటాడు సుధీర్. వెంటనే మీ ఆయన ఏడి అని అడిగేసరికి.. నీలాగే పక్క చూపులు చూస్తూ ఉంటే పక్కకు తీసుకెళ్లి నాలుగు గుద్దులు గుద్దినాను అని అంటుంది హేమ.
నీకు ఏమి అర్థమైంది అని హేమ అడిగేసరికి.. మీరు ఇప్పుడు ఫ్రీ గా ఉన్నారు అని అర్థమైంది అంటూ షాకింగ్ కామెంట్ చేస్తాడు సుధీర్. వెంటనే పక్కనున్న మరో కమెడియన్ సుధీర్ ని పక్కకు తీసుకు వెళ్తాడు. ఇందులో ఓ సింగర్ గెస్ట్ గా పాల్గొని తను పాట పాడుతున్న సమయంలో కమెడియన్ ప్రసాద్ కూడా పాడటానికి ప్రయత్నిస్తాడు. ఇక అదే సమయంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో నికృష్టుడు, దరిద్రుడు, చెప్పుతో కొట్టాలి అనే డైలాగ్ రావడంతో ఆ డైలాగ్ ను సుధీర్ ఉద్దేశించి అన్నట్లుగా చేశాడు ప్రసాద్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Actress hema, Etv show, MAA Elections, Sridevi drama company, Sudigali sudheer