సుడిగాలి సుధీర్ టాలివుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్...కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నోఆటు పోట్లు ఎదుర్కొని, జబర్దస్త్ ఎంట్రీతో స్టార్ స్థాయికి ఎదిగాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సామెతకు సుధీర్ నిలువెత్తు సాక్ష్యం. అయితే జబర్దస్త్ ప్రారంభం నుంచే ఆ షో యాంకర్ రష్మీతో ప్రేమాయణం మొదలు పెట్టేశాడు. వీరిద్దరి కెమిస్ట్రీకి ముగ్ధులైన షో నిర్వాహకులు ఏకంగా ఢీలో ఇద్దరినీ జోడీగా ప్రవేశ పెట్టి...సక్సెస్ సాధించేశారు. అంతేకాదు ఒక ఎఫిసోడ్ లో ఇద్దరికీ పెళ్లి చేసి మరీ టీమ్ మొత్తం ముచ్చట తీర్చుకుంది. అయితే నిజజీవితంలో మాత్రం సుధీర్ తనకు రష్మీకి ప్రొఫెషనల్ రిలేషన్ షిప్ మాత్రమే ఉందని పలు మార్లు చెప్పేశాడు. రష్మీ కూడా అలాగే రెస్పాన్స్ ఇచ్చింది. అలాగు పోవేపోరా ప్రోగ్రాంలో సుధీర్ తో పాటు తళుక్కుమన్న విష్ణు ప్రియ సైతం సుధీర్ తో మంచి రొమాన్స్, కెమిస్ట్రీ పండించింది. ఇద్దరూ కలిసి చేసే డ్యూయెట్స్ కోసం యూత్ యూట్యూబ్ లో ఎదురుచూస్తుంటారు. అయితే సడెన్ గా సుధీర్ ను డాడీ అని విష్ణుప్రియ తమ రిలేషన్ గురించి చెప్పేసింది. ఇప్పుడిక సుధీర్ ఒంటరివాడు అనుకుంటున్న సమయంలో బాంబు లాంటి సంఘటన బయట పడింది. తాజాగా సుధీర్ బర్త్ డే జరిగింది. అయితే సుధీర్ కోసం స్పెషల్ కేక్ తయారు చేయించారు. అందులో అతడి కెరీర్ మొత్తం కనిపించేలా డిజైన్ చేశారు. కానీ ఆ కేక్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే....దానిపై సుధీర్ కు ఇష్టమైన ప్రొఫెషన్ తో పాటు ఒక స్పెషల్ పర్సన్ కనిపించేలా డిజైన్ చేశారు. ఆమె రష్మీనో, విష్ణు ప్రియో అనుకుంటే పొరపాటే. సుధీర్ మొదటి చిత్రం హీరోయిన్, ధన్య బాలక్రిష్ణకు సుధీర్ కేక్ మీద స్థానం దక్కింది. అయితే సుధీర్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో మనస్సులో ధన్యకు స్థానం దక్కిందని, అందుకే కేక్ మీద కూడా స్థానం కల్పించినట్లు పండగ చేసుకుంటున్నారు. మరి సుధీర్ మనస్సులో ఎవరున్నారో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir, Telugu Cinema, Tollywood