బుల్లితెరపై తిరుగులేని కామెడీ షోగా జబర్దస్త్(Jabardasth Comedy show)కు పేరుంది. ఎంతో మంది జడ్జిలు మారారు. మరెంతో మంది కమెడియన్స్ వచ్చి వెళ్లారు. ఇపుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న హాస్య నటుల్లో చాలా మంది జబర్దస్త్ నుంచి వచ్చిన వారే ఉన్నారు. అంతలా ప్రేక్షకులకు దగ్గరైంది ఈ కామెడీ షో. జబర్దస్త్‌కు పోటీగా.. జీ తెలుగులో 'అదిరింది' (Adirindi).. మా టీవీలో కామెడీ స్టార్స్ (Comedy Stars) వంటి ప్రోగ్సామ్స్ వచ్చాయి. అవేమీ నిలబడలేదు. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయాయి. కానీకానీ జబర్దస్త్ మాత్రం చెక్కు చెదరలేదు. అంతకంతకూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పుడు జబర్దస్త్‌కు పోటీగా మరో కామెడీ షో వస్తోంది. ఐతే అది టీవీలో కాదు. ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆహా (Aha).. 'కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ (Comedy stock Exchange) ' పేరుతో ఓ కామెడీ షోను తీసుకొస్తోంది. ఈ షోకు సుడిగాలి సుధీర్ (Sudigali sudheer), దీపికా పిళ్లై హోస్ట్, ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) జడ్జిగా వ్యవహరిస్తున్నారు . మిగతా కామెడీ షోలతో పోల్చితే ఇది కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొస్తోంది. ప్రేక్షకులే ఇన్వెస్ట్మెంట్ .. కమెడియన్స్ స్టాక్స్.. అనిల్ రావిపూడి ఛైర్మన్.. అంటూ ఓ ప్రోమోను వదిలారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కువ మంది జబర్దస్త్ , కామెడీ స్టార్స్ టీమ్ కమెడియన్సే ఉన్నారు. అవినాష్, వేణు, సద్దాం, యాదమ్మ రాజు, హరి, భాస్కర్, జ్ఞానేశ్వర్ టీమ్ లీడర్స్‌గా వ్యవహరించబోతున్నారు.
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ తొలి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. అందులో టీమ్ లీడర్లతో పాటు డైరెక్టర్ అనిల్ రావిపూడి, హోస్ట్ సుడిగాలి సుధీర్ కూడా స్కిట్లు చేసి అలరించారు. షో ముగిసిన తర్వాత జడ్జి మార్కులు ఇవ్వరు. అక్కడున్న ప్రేక్షకులే ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. డిసెంబరు 2 నుంచి ఈ కామెడీ షో ఆహాలో ప్రసారం కానుంది.
తెలుగు ఓటీటీ ఆహాలో తెలుగు హిట్ మూవీలు, తమిళ్, మళయాలం డబ్బింగ్ చిత్రాలతో పాటు ఇప్పటికే డాన్స్ షోలు, సింగింగ్ షోలు ప్రసారం చేస్తున్నారు. ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో వచ్చే అన్ని కార్యక్రమాలను ఇక్కడ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు కామెడీ షోను సైతం లాంచ్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha app, Aha OTT, Comedy Stock Exchange, Telugu comedy show