సుడిగాలి సుధీర్ ఎప్పుడు సరదాగా నవ్విస్తూ తనపై తానే పంచులు వేసుకోవడం అలవాటు. అలాంటి సుధీర్ తాజాగా ఓ సంఘటనలో అరెస్టు అయి జబర్దస్త్ స్టేజీపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆటో రాంప్రసాద్ తో కలిసి బేడీలతో స్టేజీ ప్రవేశించిన సుడిగాలి సుధీర్ ను చూసి జడ్జి రోజా కామెంట్స్ చేయకుండా ఉండలేకపోయారు. మీరు చేసిన తప్పులకు ఎప్పుడో ఇలా చూస్తాను అనుకున్నా...ఇంత తొందరగా చూస్తాను అనుకోలేదు..అంటూ రోజా వేసిన పంచ్ దెబ్బకు సుడిగాలి సుధీర్ నోట మాటరాలేదు. అయితే ఈ మధ్య సుడిగాలి సుధీర్ స్కిట్స్ లో డైలాగ్ పూర్తి కాకముందే జడ్జి రోజా మధ్యలో ఇంప్రువైజ్ చేస్తూ వేసే పంచులు ఎప్పటి లాగే అలరించాయి.
అయితే సుడిగాలి సుధీర్ ఆ విషయాన్ని గమనించి రోజా వైపు చూడటం అందరికీ నవ్వు తెప్పించిందనే చెప్పవచ్చు. మరోవైపు సుడిగాలి సుధీర్ ను ఖైదీ గెటప్ లో చూసిన రష్మీ అయితే నోట మాటరాకుండా నవ్వుతూనే కనిపించింది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.