హోమ్ /వార్తలు /సినిమా /

సుడిగాలి సుధీర్ పై రోజా సీరియస్...షో మధ్యలోనే అంత మాట అనేసాడుగా..

సుడిగాలి సుధీర్ పై రోజా సీరియస్...షో మధ్యలోనే అంత మాట అనేసాడుగా..

రోజా, సుడిగాలి సుధీర్

రోజా, సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్ ఓ స్కిట్ లో తాము రాసుకున్న స్క్రిప్ట్ కి స్టేజీ మీద చేసే పెర్ఫార్మన్స్‌కు తేడా ఉంటోందని, పూర్తిగా సిచ్యువేషన్ మారిపోతోందని పరోక్షంగా సెటైర్ వేశాడు. ఇంతలోనే జడ్జి రోజా స్కిట్ మధ్యలోనే తన మార్కు పంచు వేసేశారు.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్‌లో తన పెర్ఫార్మన్స్ తో అందరినీ అలరిస్తుంటాడు. అయితే స్వతహాగా రైటర్ అయిన సుధీర్, కామెడీ టైమింగ్ కూడా పక్కాగా మెయిన్ టెయిన్ చేస్తుంటాడు. అయితే గతంలో స్కిట్ చేసే సమయంలో టీమ్ లు పెర్ఫార్మన్స్ మాత్రమే చేసి వెళ్లిపోయేవారు. అంతేకాదు తాము రాసుకున్నది..రాసుకున్నట్లు పెర్ఫార్మ్ చేసేవారు. స్క్రిప్ట్ లో ఉన్నది ఉన్నట్లు చేసేవారు. అయితే మధ్యలో ఎవరూ కామెంట్ చేసేవారు కాదు. స్కిట్ పూర్తి అయ్యాక జడ్జీలు మాత్రమే కామెంట్ చేసేవారు. అయితే ఈ మధ్య కాలంలో జడ్జి స్థానంలోని రోజా స్కిట్ మధ్యలోనే కమెడియన్స్ కన్నా ముందే పంచులు వేస్తున్నారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ పై ఈ పంచులు మరీ ఎక్కువగా ఉంటున్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే తాజాగా సుడిగాలి సుధీర్ ఓ స్కిట్ లో తాము రాసుకున్న స్క్రిప్ట్ కి స్టేజీ మీద చేసే పెర్ఫార్మన్స్‌కు తేడా ఉంటోందని, పూర్తిగా సిచ్యువేషన్ మారిపోతోందని పరోక్షంగా సెటైర్ వేశాడు. ఇంతలోనే జడ్జి రోజా స్కిట్ మధ్యలోనే తన మార్కు పంచు వేసేశారు. దీంతో సుడిగాలి సుధీర్ కొద్దిగా అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. తాము రాసుకున్న పంచ్ కన్నా, రోజా వేసిన పంచ్ బాగా వర్కౌట్ అయ్యిందని సెటైర్ వేశాడు. ఇదిలా ఉంటే జడ్జిగా నాగబాబు ఉన్నప్పుడు సైతం ఇలాగే స్కిట్ మధ్యలో పంచులు వేసే సాంప్రదాయానికి తెరలేపారు.

అప్పుడు సుధీర్ , హైపర్ ఆది లాంటి వారు పెద్దగా కామెంట్స్ చేయలేదు. అయితే ప్రస్తుతం రోజా జడ్జిగా ఒంటరి అయిపోయారు. దీంతో షో భారం ఆమెపై పడింది. ఎలాగైనా స్కిట్ బాగా పేలాలని తాను కూడా భాగస్వామ్యం అవుతోంది. అయితే దానిపై షో మధ్యలో సుధీర్ ఇంత సీన్ చేయడం అవసరమా.. అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరోవైపు నెట్టింట సైతం ఇదే అంశంపై చర్చలు జరుగుతున్నాయి.

First published:

Tags: Jabardasth apparao, Jabardasth comedy show, MLA Roja, Software sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు