సుడిగాలి సుధీర్, రష్మీ మధ్య బంధానికి ఏడేళ్లు...త్వరలో గుడ్ న్యూస్...

జబర్దస్త్ రష్మి, సుధీర్ (Sudigali Sudheer Rashmi Gautam)

సుధీర్, రష్మీ మధ్య ఉన్న జరగే కెమిస్ట్రీనే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సుధీర్ తో తన అనుబంధానికి ఏడేళ్లు గడిచిపోయాయని రష్మీ గుర్తు చేయడం విశేషం.

  • Share this:
    సుడిగాలి సుధీర్, రష్మీ అంటేనే తెలుగు టెలివిజన్‌పై మంచి కెమిస్ట్రీ పండిస్తారని పేరుంది. వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందని పుకార్లు షికారు సైతం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే సుధీర్ సైతం రష్మీ పేరు చెప్పగానే తనకు ఇంట్రెస్ట్ ఉన్నట్లు పరోక్షంగా సిగ్నల్స్ పంపుతుంటాడు. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఢీ టీమ్ లీడర్లుగా సైతం పలు సీజన్లుగా వ్యవహారిస్తున్నారు. ఆ షోలో సుధీర్, రష్మీ మధ్య ఉన్న జరగే కెమిస్ట్రీనే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా సుధీర్ తో తన అనుబంధానికి ఏడేళ్లు గడిచిపోయాయని రష్మీ గుర్తు చేయడం విశేషం. అయితే ఏడేళ్లుగా సుధీర్ తనను సిన్సియర్ గా ఫాలో అవుతున్నాడని రష్మీ స్వయంగా చెప్పడం విశేషం. ఢీ షో వేదిక ద్వారా రష్మీ ఇవన్నీ ఎక్స్ ప్రెస్ చేసినప్పటికీ, సుధీర్ కళ్లలో మాత్రం రష్మీ గురించి ప్రేమ కనిపిస్తోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సుధీర్, రష్మీ మధ్య కెమిస్ట్రీకి ఏడేళ్లు గడిచిపోయాయి. మరి ఇప్పటికైనా వీరిద్దరూ కలిసి వెండితెరపై కనిపిస్తారా లేదా అనే గుడ్ న్యూస్ కోసం నెట్టింట అభిమానులు వేచిచూస్తున్నారు.
    First published: