మరో సారి రష్మీ, సుధీర్ కెమిస్ట్రీ అదిరిపోయిందిగా..

సుధీర్, రష్మీ (Screen Grab)

బుల్లి తెరపై హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ, సుడిగాలి సుధీర్ ఏం చేసినా ముచ్చటగా ఉంటుంది.

  • Share this:
    బుల్లి తెరపై హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రష్మీ, సుడిగాలి సుధీర్ ఏం చేసినా ముచ్చటగా ఉంటుంది. వాళ్లిద్దరి కెమిస్ట్రీ చూస్తే జంట అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. వాళ్లిద్దరు కలిసి చేసిన స్కిట్ అయినా... యాకరింగ్ అయినా ప్రేక్షకులకు కన్నుల పండువలా ఉంటుంది. అందుకే వాళ్ల వీడియోలకు యూట్యూబ్ లో మిలయన్ల సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. హిట్ కపుల్ గా పేరు సాధించిన వీళ్లిద్దరు ఆడియన్స్ ను మరింతగా అట్రాక్ట్ చేసేందుకు టీవీ స్క్రీన్ పై రొమాన్స్ పాళ్లు మరి కొంచెం పెంచినట్టు కనిపిస్తోంది. దీనికి తాజాగా వచ్చిన ఢీ ప్రోమోనే ఉదాహరణగా నిలుస్తోంది. ప్రేక్షకుల అభిరుచిని పసిగట్టిన ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ రష్మీ, సుధీర్ ల కాంబినేషన్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. దీంట్లో భాగంగా ఇవాళ మరి కొన్ని గంటల్లో ప్రసారం కానున్న ఢీ టీజర్ లో రష్మీ, సుధీర్ లో జంట సూపర్ హిట్ సాంగ్ ‘బుట్ట బొమ్మ’ లో డాన్స్ చేసి అదరగొట్టారు. అలవైకుంఠపురంలో సినిమాలోని ఈ పాటలో పూజా హెగ్డే ధరించిన పొట్టి గౌనును పోలిన పింక్ డ్రెస్ లో రష్మీ, బన్నీని ఇమిటేట్ చేస్తూ దాదాపుగా అలాంటి ఫిటింగ్ లో ఉండే డ్రెస్ లో సుధీర్ డాన్స్ చేశారు. ఒకరినొకరు హత్తుకుంటూ... కళ్లలోకి కళ్లు పెట్టి చూసుకుంటూ రొమాన్స్ పండించే ప్రయత్నం చేశారు వీరిద్దరు. వీళ్ల పర్ఫార్మెన్స్ చూస్తున్న న్యాయ నిర్ణేతలు శేఖర్ మాస్టర్, ప్రియమణి, పూర్ణ కళ్లెగరేస్తూ చూస్తూ ఉండిపోయారు.

    మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకున్న ఈ పర్ఫార్మెన్స్ కు ఆడియన్స్ మాత్రం ఈ హిట్ పెయిర్ పై మిశ్రమంగా స్పందించారు. ‘కింద మీద ఊపు.. సుధీరన్న తోపు’ అని కొందరు.. ‘హీట్ పెయిర్’ అని మరి కొందరు... వీళ్లిద్దరు పెళ్లి చేసుకోవాలని ఇంకొందరు కామెంట్స్ పెట్టారు. ఇక.. వీళ్లంటే గిట్టని వారు మాత్రం ఎక్కువ అయిందని... సోదని... అంత అవసరమా అని.. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్లు స్పందించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: