హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: అనసూయతో కలిసి సుడిగాలి సుధీర్ కొత్త షో.. ఫ్యాన్స్‌కు పండగే

Sudigali Sudheer: అనసూయతో కలిసి సుడిగాలి సుధీర్ కొత్త షో.. ఫ్యాన్స్‌కు పండగే

సుడిగాలి సుధీర్, అనసూయ

సుడిగాలి సుధీర్, అనసూయ

జబర్దస్త్ టీంలో అదిరిపోయే స్కిట్లు చేస్తూ.. మరోవైపు పలు షోలకు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు సుధీర్. తాజాగా సుధీర్ యాంకర్‌గా మరో షో రానుంది.

సుడిగాలి సుధీర్(Sudigali Sudheer) బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో అభిమానించే వ్యక్తి. సుడిగాలి సుధీర్ చేస్తున్న షో అంటే దానికి రేటింగ్ మామూలుగా ఉండదు. జబర్దస్త్(Jabardasth) తో పాటు, ఈటీవీలో ప్రసారమయ్యే పలు ఈవెంట్లలోనూ పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు సుధీర్. తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే.. బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్‌గా నటుడిగా పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టీంలో అదిరిపోయే స్కిట్లు చేస్తూ.. మరోవైపు పలు షోలకు యాంకరింగ్ కూడా చేస్తున్నాడు సుధీర్. తాజాగా సుధీర్ యాంకర్‌గా మరో షో రానుంది. అది ప్రముఖ టీవీ ఛానల్.. స్టార్ మా(Star Maa)లో ప్రసారం కానుంది.

తాజాగా స్టార్ మా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కొత్త కొత్త ప్రతిభావంతులైన గాయనీ గాయకులను పరిచయం చేయడంలో ముందుంటుంది “స్టార్ మా”. స్టార్ మా స్టార్ సింగర్ వేదిక పై పాటలు పాడిన ఎందరో ఇప్పుడు మంచి సింగర్స్ గా తమ స్వరాలను వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు స్టార్ మా పిల్లల కోసం “సూపర్ సింగర్ జూనియర్” పేరుతో ఓ కొత్త సిరిస్ ని రూపొందించింది. 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలతో జరగనున్న ఈ సిరీస్‌లో పాల్గొననున్నారు. ఈ సిరీస్ కోసం పిల్లల నుంచి ఎంట్రీలు పంపించమని స్టార్ మా లో ప్రోమో ప్రసారం చేసినపుడు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి 3 వేలకు పైగా ఎంట్రీ లు వచ్చాయి.

వీరిలో 14 మంది టాప్ కంటెస్టెంట్స్ షో లో పాల్గొనే అర్హత సాధించారు. వీళ్ళతో “సూపర్ సింగర్ జూనియర్” సిరీస్ ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమానికి సుధీర్, అనసూయ ఎనెర్జిటిక్ గా నడిపించనున్నారు. ఎన్నో భాషల్లో వేల పాటలు పాడి, ఎన్నో సినిమాలకు డబ్బింగు చెప్పిన మనో, ప్రముఖ గాయని చిత్ర, సెన్సషనల్ టాలెంట్స్ రెనినా రెడ్డి, హేమచంద్ర సూపర్ సింగర్ జూనియర్ షోకు జడ్జీలుగా వ్యవహరించనున్నారు. “సూపర్ సింగర్ జూనియర్” మే 22 న సాయంత్రం 6 గంటలకు అంగరంగ వైభవంగా లాంచ్ అవుతోంది. ఆ తరవాత వారం నుంచి ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. దీంతో ఇప్పుడు సుధీర్‌తో పాటు అనసూయ అభిమానులు ఈ కొత్త షోకు విషెస్ చెబుతున్నారు. సుధీర్ చేస్తున్న ఈ షో కూడా హిట్ అవ్వడం ఖాయం అంటున్నారు.

First published:

Tags: Anasuya Bharadwaj, Star Maa, Sudigali sudheer

ఉత్తమ కథలు