Home /News /movies /

SUDHEER BABU SRIDEVI SODA CENTER GETS GOOD OFFER FROM ZEE5 HERE ARE THE DETAILS SR

Sudheer Babu : కష్టకాలంలో నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టిన సుధీర్ బాబు...

Sudheer Babu Photo : Twitter

Sudheer Babu Photo : Twitter

Sudheer Babu : యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సమంత, నాగచైతన్యలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

    యంగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన సమంత, నాగచైతన్యలు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఏమాయ చేశావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. ఆ తర్వాత ఆయన శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్, ఆడు మగాడ్రాబుజ్జి వంటి సినిమాలతో అలరించారు. ఆ మధ్య సుధీర్ బాబు, నాని హీరోలుగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన వి సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టారు. కానీ ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో వెనుకబడింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి మోహన కృష్ణ దర్శకత్వంలో సుధీర్ ఓ సినిమాను చేస్తున్నారు. వీరి కాంబోలో గతంలో సమ్మోహనం అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక తాజా సినిమా ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ రానుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని గాజులపల్లే సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. అనే టైటిల్‌ను ఖరారు చేశారు దర్శకనిర్మాతలు.

    ఇక సుధీర్ బాబు నటిస్తున్న మరో చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. మాస్ ప్రేక్షకులకు టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రానికి మంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈసినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ రూ.9 కోట్లకు దక్కించుకుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. అయితే ఈ డీల్‌తో ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు ఇప్పటివరకు పెట్టిన ఖర్చులు తిరిగొచ్చాయని టాక్ తెలుస్తోంది. దీంతో నిర్మాతలు సంతోషంగా ఉన్నారట. ఈ సినిమా పలాస సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన డైరెక్టర్ కరుణ్ కుమార్ డైరెక్షన్‌లో వస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Sudheer Babu, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు