హోమ్ /వార్తలు /సినిమా /

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
2.5/5
రిలీజ్ తేదీ:16/9/2022
దర్శకుడు : ఇంద్రగంటి మోహనకృష్ణ (Indraganti Mohana Krishna)
సంగీతం : వివేక్ సాగర్
నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, రాహుల రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు..
సినిమా శైలి : ఫ్యామిలీ డ్రామా(Family Drama)

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinch Meeku Cheppali Twitter Review Photo : Twitter)

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి (Aa Ammayi Gurinch Meeku Cheppali Twitter Review Photo : Twitter)

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనే విషయం మన మూవీ రివ్యూలో చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

 రివ్యూ : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి(Aa Ammayi Gurinchi Meeku Cheppali)

నటీనటులు : సుధీర్ బాబు, కృతి శెట్టి, వెన్నెల కిషోర్, రాహుల రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు..

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సినిమాటోగ్రఫీ: పి.జి.విందా

సంగీతం: వివేక్ సాగర్

నిర్మాత : మహేంద్ర బాబు, కిరణ్ బళ్లపల్లి

దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ

విడుదల తేది :16/9/2022

సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్‌గా సెన్సిబుల్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ రోజు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందనే విషయం మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

నవీన్ (సుధీర్ బాబు) టాప్ మోస్ట్ టాలీవుడ్ కమర్షియల్  డైరెక్టర్. ఈయన  మాస్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌తో  ఇండస్ట్రీలో తన  కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటాడు. ఈ కోవలో ఈ దర్శకుడికి అనుకోకుండా ఓ పాత రీల్ ఉన్న వీడియో ఒకటి దొరుకుతుంది. అందులో అలేఖ్య (కృతిశెట్టి) ఉన్న వీడియో చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆమెతోనే తన నెక్ట్స్ సినిమా తెరకెక్కించాలనుకుంటాడు. ఈ కోవలో ఆమెను కలసుకోవడానికీ ఎన్నో ప్రయత్నాలు చేసి చివరకు ఎలాగో  కలుస్తాడు. ఆ తర్వాత ఈమెకు తన నెక్ట్స్ సినిమాలో హీరోయిన్ ఆఫర్ ఇస్తాడు. దీనికి అలేఖ్యతో పాటు  వాళ్ల కుటుంబ సభ్యులు ఎలా రియాక్ట్ అయ్యారు. మరి దర్శకుడు తన అ కంట పడ్డ ఆ యువతితో తను అనుకున్న సినిమాను  తెరకెక్కించాడా   లేదా అనేదే ‘ఆ అమ్మాయి గురించి మీకు  స్టోరీ’.

కథనం, టెక్నీషియన్స్ విషయానికొస్తే..

దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ స్టోరీ రెగ్యులర్ స్టోరీలా కాకుండా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నాడు. సినిమాలో సినిమా చూపించాడు. ఇలాంటి సబ్జెక్ట్స్ తెరకెక్కించడం కత్తి మీద సామే. గతంలో దాసరి లాంటి వారు ఇలాంటి ప్రయోగాలు చేసారు. ఇక ఇంద్రగంటి కూడా తన గత సినిమా ‘సమ్మోహనం’ కూడా సినిమా నేపథ్యంలోనే తెరకెక్కించాడు. ముఖ్యంగా  తాను అనుకున్న సబ్జెక్ట్‌ను సరైన విధానంలో తెరకెక్కించినా.. కమర్షియల్ హంగులకు దూరంగా ఉండటం.. సినిమా నిడివి ఎక్కువగా ఉండటం వంటివి ఈ సినిమాకు మైనస్‌గా మారే అవకాశలున్నాయి. మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా ఏ మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఫస్ట్‌లో ఓ   కమర్షియల్‌గా ఈ సినిమా వర్కౌట్ అయ్యే అవకాశాలు అంతగా లేవనే చెప్పాలి. ఈ సినిమాలో దర్శకుడు ఒక లాజిక్ మరిచిపోయినట్టున్నారు.  టెక్నాలజీ పెరిగిన ఈ జనరేషన్‌లో ఒక అమ్మాయి పట్టుకోవడానికీ పాత పద్ధతిలో ఫోటో పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరకీ వెళ్లి ఎంక్వెరీ చేయడం లాంటివి లాజిక్‌కు అందవు. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి ఆ అమ్మాయి గురించి ఎంక్వెైరీ చేస్తే సరిపోతుంది. సినిమా ఎలా ఉన్న క్లైమాక్స్‌ను మాత్రం ప్రేక్షకులను కట్టిపడేేసేలా తెరకెక్కించాడు. ఇక వి.జి.విందా సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచింది.

నటీనటుల విషయానికొస్తే.. 

సుధీర్ బాబు ఇప్పటి వరకు ప్రతి సినిమాలో నటుడిగా కనిపిస్తే.. ఈ సినిమా నవీన్ అనే దర్శకుడి పాత్రలో లీనమై నటించాడు. యాక్టర్‌‌గా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. దర్శకుడి పాత్రను ఎంతో ఈజ్‌తో నటించాడు. సినిమా మొత్తం ఆ పాత్ర కనపడుతుంది. సుధీర్ బాబు తన యాక్టింగ్‌ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో కొత్త సుధీర్ బాబును చూస్తారు.  కృతి శెట్టి.. ఇప్పటి వరకు గ్లామర్‌ డాల్‌గా కనిపించినా.. ఇందులో మాత్రం తన నటనతో ఆకట్టుకుంది. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. ఈమెలో మంచి నటి ఉందనే విషయం ఇంద్రగంటి బాగానే గుర్తించాడు. ఇక వెన్నెల కిషోర్.. సుధీర్ బాబు అసిస్టెంట్‌గా తన పాత్రకు న్యాయం చేసాడు. రాహుల్ రామకృష్ణ నటన పర్వాలేదు. ఇక హీరోయిన్ తండ్రి శ్రీకాంత్ అయ్యంగార్ పాత్రలో జీవించాడు. ఒక సామాన్య మధ్య తరగతి తండ్రిగా తన నటనను ప్రదర్శించాడు.

ప్లస్ పాయింట్స్ 

సుధీర్ బాబు, కృతి శెట్టిల నటన

క్లైమాక్స్

ఎమోషనల్ సన్నివేశాలు..

మైనస్ పాయింట్స్ 

స్లో నేరేషన్

సినిమా నిడివి

కమర్షియల్ వాల్యూస్

చివరి మాట : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. జస్ట్ ఓకే అనిపించే సెన్సిబుల్ స్టోరీ

రేటింగ్ : 2.75/5

Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
2.5/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
3/5

Tags: Aa Ammayi Gurinchi Meeku Cheppali, Krithi shetty, Sudheer Babu, Tollywood

ఉత్తమ కథలు