Home /News /movies /

SUDHEER BABU KRITHI SHETTY AA AMMAYI GURINCHI MEEKU CHEPPALI TEASER REVIEW PK

Aa Ammayi Gurinchi Meeku Cheppali teaser: సుధీర్ బాబు, కృతి శెట్టి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ టీజర్ రివ్యూ..

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ (sudheer babu aa ammayi gurinchi meeku cheppali movie)

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి టీజర్ (sudheer babu aa ammayi gurinchi meeku cheppali movie)

Aa Ammayi Gurinchi Meeku Cheppali teaser: తెలుగు ఇండస్ట్రీలో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. తాజాగా సుధీర్ బాబు (Sudheer Babu), కృతి శెట్టి (Krithi Shetty) జంటగా ఈయన తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

ఇంకా చదవండి ...
తెలుగు ఇండస్ట్రీలో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అప్పుడప్పుడూ ఈయన కూడా బందిపోటు, వి లాంటి రెగ్యులర్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నాడు. అందుకే తన దారిలోకి వచ్చి.. ఇప్పుడు ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కిస్తున్నాడు. సుధీర్ బాబు, కృతి శెట్టి జంటగా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఒక్కసారి ఇంద్రగంటి ఎవరైనా హీరోతో కనెక్ట్ అయ్యాడు అంటే వరసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటాడు. సుధీర్ బాబు ఇప్పుడు ఆయనకు అలాగే కనెక్ట్ అయ్యాడు. 4 ఏళ్ళ కింది ఈ కాంబినేషన్‌లో మొదటిసారి సమ్మోహనం సినిమా వచ్చింది.

సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి అప్లాజ్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించాడు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇందులో సుధీర్ బాబుకు జోడీగా సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది.

Puneeth Rajkumar: పునీత్ రాజ్‌కుమార్ ఫ్యాన్స్‌కు పండగ చేసుకునే వార్త.. మార్చ్ 17న పండగే..


తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే సినిమా ఎలా ఉండబోతుందో కూడా అర్థమైపోతుంది. ముఖ్యంగా సినిమాలో సినిమా చూపిస్తున్నాడు సుధీర్ బాబు. అందులో ఆయన దర్శకుడిగా నటిస్తున్నాడు. వరస విజయాలు అందుకుంటున్న ఓ దర్శకుడు.. ఓ రియల్ లైఫ్ ఎమోషనల్ డ్రామా చేయాలనుకున్నపుడు ఓ అమ్మాయిని చూస్తాడు. ఆమెతోనే సినిమా చేయాలనుకుంటాడు. కానీ ఆమెకు సినిమాలు అంటే యిష్టం ఉండదు.


ఎలాగైనా ఒప్పించి సినిమా చేయడమే ఈ సినిమా కథ. టీజర్ చివర్లో నేను మీ సినిమా చేస్తాను కానీ ఓ కండీషన్ అంటూ కృతి శెట్టి చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. వి సినిమా నిరాశ పరచడంతో ఇంద్రగంటి ఈసారి తనకు అచ్చొచ్చిన దారిలోనే ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి వాటిని ఎంతవరకు ఈ సినిమా అందుకుంటుందో చూడాలి.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Indraganti Mohana Krishna, Krithi shetty, Sudheer Babu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు