హోమ్ /వార్తలు /సినిమా /

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Aa Ammayi Gurinchi Meeku Cheppali : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

Aa Ammayi Gurinchi Meeku Cheppali Twitter Review Photo : Twitter

Aa Ammayi Gurinchi Meeku Cheppali Twitter Review Photo : Twitter

Aa Ammayi Gurinchi Meeku Cheppali Twitter Review : తెలుగు ఇండస్ట్రీలో రొటీన్‌కు భిన్నంగా సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ. అప్పుడప్పుడూ ఈయన కూడా బందిపోటు, వి లాంటి రెగ్యులర్ సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి.. సుధీర్ బాబు, కృతి శెట్టి హీరో, హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 16న విడుదలవుతోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్‌గా వస్తోన్న లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ లవ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ (Aa Ammayi Gurinchi Meeku Cheppali ) ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈ సినిమా మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇప్పటికే ట్రైలర్ అండ్ టీజర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమాకు (Indraganti Mohana Krishna) మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. బెంచ్ మార్క్ స్టూడియోస్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు. సుధీర్ బాబు, కృతి శెట్టిలతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, కునాల్ కౌశిక్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాకు (Aa Ammayi Gurinchi Meeku Cheppali Released) సంబంధించి ఇప్పటికే ప్రీవ్యూస్ పడ్డాయి. దీంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు.. సినిమా ఎలా ఉంది.. కథేంటీ.. తెలుగు వారని ఎలా ఆకట్టుకోనుంది.. హీరో హీరోయిన్స్ ఎలా చేశారు.. వంటీ అంశాలపై కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.. అదేంటో చూద్దాం..

  ఇంద్రగంటి మోహనకృష్ణ ఇపుడు ఓ అందమైన ప్రేమకథ తెరకెక్కించాడని తెలుస్తోంది. ఒక్కసారి ఇంద్రగంటి ఎవరైనా హీరోతో కనెక్ట్ అయ్యాడు అంటే వరసగా ఆయనతోనే సినిమాలు చేస్తుంటారు. సుధీర్ బాబు ఇప్పుడు ఆయనకు అలాగే కనెక్ట్ అయ్యాడు. 4 ఏళ్ళ కింది ఈ కాంబినేషన్‌లో మొదటిసారి సమ్మోహనం సినిమా వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో సాగే ఈ సున్నితమైన ప్రేమకథకు మంచి అప్లాజ్ రావడమే కాకుండా విజయం కూడా అందుకుంది. ఆ తర్వాత నాని హీరోగా వచ్చిన 25వ సినిమా ‘వి’లో కూడా సుధీర్ బాబు మరో హీరోగా నటించారు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.

  ట్విట్టర్ కామెంట్స్ చూస్తుంటే.. సినిమా బాగానే ఉందని తెలుస్తోంది. కొంతమంది ఫస్టాఫ్  బాగుంది అంటున్నారు. మరికొంత మంది సెకండాఫ్ బాగుందని అంటున్నారు. చూడాలి మరి మొత్తంగా సినిమా ఎలా ఉండనుందో..

  ఇందులో సుధీర్ బాబుకు జోడీగా సెన్సేషనల్ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ కథ అంతా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కంప్లీటైంది. 'సెన్సార్ వాళ్లు ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ జారీ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఇక సుధీర్ బాబు గతేడాది‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా చేసారు. ఇక కృతి శెట్టి.. ఈ యేడాది బంగార్రాజు మూవీతో హాట్రిక్ హిట్ అందుకుంది. ఆ తర్వాత చేసిన ‘ది వారియర్’ మూవీతో పాటు ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇపుడు ‘ ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Aa Ammayi Gurinchi Meeku Cheppali, Indraganti Mohana Krishna, Krithi shetty, Sudheer Babu, Tollywood news

  ఉత్తమ కథలు