SUDHEER BABU KARUNA KUMAR ACTION DRAMA SRIDEVI SODA CENTER MOVIE COMPLETED CENSOR AND HERE THE REVIEW PK
Sridevi Soda Center censor: సెన్సార్ పూర్తి చేసుకున్న సుధీర్ బాబు ‘శ్రీదేవి సోడా సెంటర్’.. రివ్యూ ఇదే..!
శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center)
Sridevi Soda Center censor: సుధీర్ బాబు(Sudheer Babu), ఆనంది(Anandhi) ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది.
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్‌కు, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్.. ఇలా అన్నీ సమపాళ్లలో కలిసిన శ్రీదేవి సోడా సెంటర్ ట్రైలర్ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మిలియన్ల కొద్దీ వ్యూస్ అందుకుంటుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. పిల్లలు పెద్దలు అంతా కలిసి చూడదగ్గ సినిమా అంటూ.. U/A సర్టిఫికేట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. సినిమాలో కొన్నిచోట్ల యాక్షన్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. దాంతో పాటు డైలాగులు కూడా అక్కడక్కడా కాస్త శృతి మించినట్లు అనిపిస్తున్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇండియా వ్యాప్తంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు చాలా మంచి బిజినెస్ జరిగింది. ఈ సినిమా థియెట్రికల్ రైట్స్ ఫాన్సీ ప్రైస్ కు అమ్ముడయ్యాయి. సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత లక్ష్మణ్ శ్రీదేవి సోడా సెంటర్ హక్కులను సొంతం చేసుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న శ్రీదేవి సోడా సెంటర్ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు లక్ష్మణ్.
సుధీర్ బాబు (Sudheer Babu)
ఇండియాలోనే కాదు ఓవర్సీస్లోనూ భారీగా విడుదలవుతుంది శ్రీదేవి సోడా సెంటర్. ఇప్పటికే అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. జాతి రత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లక్ష్మణ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా ఇది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.