హోమ్ /వార్తలు /సినిమా /

Sridevi Soda Center Collections: నష్టాలను మిగిల్చిన సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్..

Sridevi Soda Center Collections: నష్టాలను మిగిల్చిన సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్..

శ్రీదేవి సోడా సెంటర్ కలెక్షన్స్ (Sridevi Soda Center Photo : Twitter)

శ్రీదేవి సోడా సెంటర్ కలెక్షన్స్ (Sridevi Soda Center Photo : Twitter)

Sridevi Soda Center Collections: శ్రీదేవి సోడా సెంటర్’ థియేట్రికల్ బిజినెస్ రూ.7.98 కోట్ల వరకు జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఈ చిత్రం రూ.8.5 కోట్ల షేర్ ను రాబట్టాలి.

Sridevi Soda Center Collections : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. శ్రీదేవి సోడా సెంటర్‌ను 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్ట్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్రో టీజర్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్,ట్రైలర్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ విడులవ్వడంతో పాటు.. ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

అయితే ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేక పోయిందని తెలుస్తోంది. ఈ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం లోనే చేతులు ఎత్తేసిందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

ఈ సినిమా (Sridevi Soda Center 7 Days Total Collections) మొదటి వీకెండ్‌లో పర్వాలేదనిపించినా... వర్కింగ్ డేస్‌లో కలెక్షన్స్ రాబట్టలేక కుదేలు అయ్యింది. ఈ సినిమా మొదటి వారం పూర్తీ అయ్యే సరికి బ్రేక్ ఈవెన్ మొత్తంలో సగం వరకు రికవరీ చేసి నష్టాలను మిగిల్చింది.

మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ చూస్తే…

Nizam: 1.38Cr

Ceeded: 66L

UA: 54L

East: 36L

West: 20L

Guntur: 40L

Krishna: 22L

Nellore: 11L

AP-TG Total:- 3.87CR(6.35Cr Gross)

KA+ROI: 10L

OS: 23L~

Total Collections: 4.20CR(7.20CR~ Gross)

ఈ సినిమాను 8 కోట్ల రేంజ్ లో అమ్మగా సినిమా 8.5 కోట్ల రేంజ్‌తో బరిలోకి దిగింది. అయితే ఈ సినిమాలో సుధీర్ బాబు, ఆనందిలు తమ నటనతో ఆకట్టుకున్న ఎందుకో బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది.

First published:

Tags: Sridevi Soda Center, Sudheer Babu, Tollywood news

ఉత్తమ కథలు