హోమ్ /వార్తలు /సినిమా /

Sridevi Soda Center Twitter Review : సుధీర్ బాబు ఆనందిల శ్రీదేవి సోడా సెంటర్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

Sridevi Soda Center Twitter Review : సుధీర్ బాబు ఆనందిల శ్రీదేవి సోడా సెంటర్ ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ..

శ్రీదేవి సోడా సెంటర్ కలెక్షన్స్ (Sridevi Soda Center Photo : Twitter)

శ్రీదేవి సోడా సెంటర్ కలెక్షన్స్ (Sridevi Soda Center Photo : Twitter)

Sridevi Soda Center Twitter Review : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం ఆగష్ట్ 27న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. అయితే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అవేంటో చూద్దాం..

ఇంకా చదవండి ...

  Sridevi Soda Center Twitter Review : సుధీర్ బాబు (Sudheer Babu), ఆనంది (Anandhi) ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాను పలాస 1978 ఫేమ్ దర్శకుడు కరుణ్ కుమార్ డైరెక్ట్ చేసారు. శ్రీదేవి సోడా సెంటర్‌ను 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగష్ట్ 27న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్రో టీజర్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్,ట్రైలర్ పాటలకు మంచి స్పందన వచ్చింది. దీనికి తోడు మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్‌ విడులవ్వడంతో పాటు.. ప్రభాస్ కూడా ఈ సినిమాకు తనదైన శైలిలో ప్రచారం చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో సుధీర్ బాబు.. సూరిబాబు పాత్రలో ఊర మాస్ పాత్రలో అదరగొట్టారు. సోడాలు అమ్ముకునే శ్రీదేవిని హీరో ప్రేమించడం.. ఆ తర్వాత వీళ్లిద్దరి పెళ్లికి కులం అడ్డు రావడం వంటి విషయాలను ఈ సినిమా చర్చిస్తోంది.

  ఇక ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. అయితే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులు ఈ సినిమా పట్ల తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంటున్నారు. అసలు కథేంటీ.. సుధీర్ బాబు మాస్ లుక్ ఎలా ఆకట్టుకుంటోంది... ఆనంది నటన ఎలా ఉంది.. అసలు కథేంటీ మొదలగు విషయాలను పంచుకుంటున్నారు.. అవేంటో చూద్దాం..

  ఇక ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రం బిజినెస్ విషయానికి వస్తే.. ఈ సినిమాను రూ.8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ.12.5 కోట్లు వచ్చాయి. ఇక థియేట్రికల్ రైట్స్ రూ.7.98 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే.. ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Sudheer Babu, Tollywood news

  ఉత్తమ కథలు